Jagananna Colony Layouts Lands Victims: దారీ తెన్ను లేని స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగనన్న కాలనీ లేఔట్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. పీ.గన్నవరం మండలం మానేపల్లిలో రెండేళ్ల క్రితం 104 మంది లబ్ధిదారులకు జగనన్న లేఅవుట్ లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాల కోసం పక్కా ఇళ్లు మంజూరు చేయకపోయినా ఇక్కడ లబ్ధిదారులు కొంతమంది సొంతంగా పక్కా ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు.
YCP Local Leader Anarchy: 'దేవుడు కరుణించినా.. వరమివ్వని పూజారి'
భూ సేకరణ చేసిన రెవెన్యూ అధికారులు దారిలేని స్థలాన్ని సేకరించి లబ్ధిదారులకు కట్టబెట్టారు. స్థానికంగా ఒక రైతు సహకరించడంతో కొంతమంది లబ్ధిదారులు రైతుకు చెందిన స్థలం నుంచి ఇళ్ల నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లి పనులు మొదలుపెట్టారు. అయితే 8 నెలల క్రితం ఆ రైతు తన స్థలంలో నుంచి వెళ్లేందుకు వీలులేదని దారి మూసేశారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి.
పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోన్న జగనన్న లేఅవుట్
దారిలేని స్థలాన్ని తమకు ఎందుకు కేటాయించారని బాధితులు లబోదిబోమంటున్నారు. జగనన్న లేఅవుట్‌కు దారి చూపించాలని బాధితులు స్పందన కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. పాలకుల చుట్టూ కాళ్లరిగేళా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని మండిపడుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు ఆగిపోవటంతో తాము పడుతున్న వేదన అంతా ఇంత కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జగనన్న లేఅవుట్ స్థలంలోకి వెళ్లేందుకు దారి కేటాయించాలని లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నారు.
జగనన్న లే అవుట్ కోసం...జీవనాధారమైన భూములు పోగొట్టుకున్న రైతులు
"దారీ తెన్ను లేని స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించి జగన్ సర్కార్ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. దూరంగా ఇంటి నిర్మాణానికి పనికిరాని భూములను పంపిణీ చేశారు. అయినా కూడా గతిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికి లేఅవుట్ల వద్దకు వెళ్లేందుకు దారిలేక నానావస్థలు పడుతున్నాం. భూ సేకరణ చేసిన రెవెన్యూ అధికారులు దారిలేని స్థలాన్ని సేకరించి మాకు కట్టబెట్టారు. జగనన్న లేఅవుట్‌కు దారి చూపించాలని పాలకుల చుట్టూ కాళ్లరిగేళా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జగనన్న లేఅవుట్ స్థలంలోకి వెళ్లేందుకు దారి కేటాయించాలని కోరుతున్నాం." - బాధితులు
Jagananna Colony Layout: లబోదిబోమంటున్న జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల లబ్దిదారులు..