ETV Bharat / state

గతంలో ట్రాన్సుపోర్టు అధికారి ఇప్పుడు దొంగ - ₹40లక్షలు చోరీ 42 గంటల్లోపే! - POLICE CHASED HIGHWAY ROBBERY CASE

జాతీయ రహదారులపై దోపిడీ లీలలు- కమర్షల్​ టాక్స్​ అధికారులమంటూ లూటీలు- చివరకు పోలీసులకు చిక్కిన దొంగలు.

thefts_on_national_highways_bapatla_district
thefts_on_national_highways_bapatla_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 12:03 PM IST

Thefts on National Highways Bapatla District : కమర్షియల్‌ టాక్స్‌ అధికారుల మాదిరి జాతీయ రహదారి పక్కన కారుతో మాటువేసి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేదరమెట్ల స్టేషన్‌ పరిధిలో ఇటీవల సరకు రవాణా చేసే వాహనంలో ప్రయాణిస్తున్న బంగారు నగల వ్యాపారి స్వరూప్‌ను కొట్టి అతని నుంచి రూ.39.50 లక్షలు అపహరించుకుపోయిన నలుగురు సభ్యుల ముఠాను 48 గంటల్లోపే పట్టుకోవటంతో కేసు చిక్కుముడి వీడింది.

Thefts on National Highways in the Name of Commercial Tax Officers : కేసును మేదరమెట్ల, అద్దంకి రూరల్‌ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. వ్యాపారిని బెదిరించి పట్టుకుపోయిన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో గూడ్స్‌ ట్రాన్సుపోర్టులో పని చేసిన ఓ ఉద్యోగి ఈ కేసులో సూత్రధారిగా గుర్తించారు. అతనికి సరకు లారీలో ప్రయాణించే వ్యాపారులపై పక్కా సమాచారం ఉందని ఆయనే ఈ దోపిడీకి వ్యూహం రచించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల ముఠాను మంగళ, బుధవారంలో అరెస్టు చూపే అవకాశం ఉంది.

విజయవాడ నుంచి అనుసరిస్తూ : గుంటూరుకు చెందిన నగల వ్యాపారి తరచూ చెన్నై వెళతారు. అక్కడ బంగారు నగలు కొనుగోలు చేసి గుంటూరుకు అదే ట్రాన్సుపోర్టులో వస్తారు. యధావిధిగానే వ్యాపారి స్వరూప్‌ బంగారు నగలు కొనుగోలుకు ఈ నెల 18న రాత్రి గుంటూరులో లారీ ఎక్కారు. ఆ సరకు లారీ విజయవాడ నుంచి వస్తోంది. అక్కడి నుంచే ఆ ట్రాన్సుపోర్టులో పనిచేసిన మాజీ ఉద్యోగి మరో ఇద్దరితో కలిసి కారులో లారీని అనుసరిస్తున్నారు. గుంటూరులో ఈ వ్యాపారి ఎక్కగానే కొరిశపాడు ఫ్లైఓవర్‌కు సమీపంలో మాటువేసిన మరో ఇద్దరు సభ్యులకు ముందస్తు సమాచారమిచ్చి వారిని లారీ ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకోగానే రహదారికి అడ్డుగా నిలబడి తనిఖీ అధికారుల మాదిరి నటించేలా చేస్తారు. లారీ ఆగగానే వెనక నుంచి అనుసరిస్తున్న కారును ఒక్కసారిగా లారీ ముందుకు తెచ్చి అడ్డు పెడతారు.

లారీ డ్రైవర్‌ను, క్యాబిన్‌లో కూర్చొన్న వ్యాపారిని కిందకు దిగాలని తాము కమర్షియల్‌ టాక్సు అధికారులమని బిల్లులు చూపాలని కోరారు. కిందకు దిగగానే వ్యాపారిని పథకం ప్రకారం పి.గుడిపాడు వైపు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అక్కడ బెదిరించి బ్యాగ్‌తో సహా నగదు తీసుకుని విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి తిరిగి లారీ వద్దకు తెచ్చి వదిలేశారు. అప్పటి దాకా లారీని అక్కడే నిలిపి డ్రైవర్‌కు ఇద్దరు వ్యక్తులు కాపలా ఉంటారు. వ్యాపారిని తీసుకురాగానే అంతా కలిసి కారులో వెళ్లిపోతారు.

బాపట్ల జిల్లాలో భారీ చోరీ - లారీని అడ్డగించి వ్యాపారి నుంచి రూ.39 లక్షలు అపహరణ

స్థానికుల సమాచారం పట్టించిన కారు నంబరు : లారీని ఆపి కారులో వ్యాపారిని ఎక్కించుకుని వెళుతున్న ఉదంతాన్ని స్థానికుడు ఒకరు చూశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని అక్కడి వారిని విచారించి ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజీలు తీసి కారును గుర్తించారు. కారుపై నంబరు ఆధారంగా ఈ మొత్తం అపహరణకు సూత్రధారులు, పాత్రధారులు దొరికిపోయారు. కారు నంబరు లభించగానే దాని నిర్వాహకుడి ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ తీసుకుని వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవటంతో కేసు చిక్కుముడి వీడింది.

లారీ వెంట మూడు రోజులు రెక్కీ : ఈ ముఠా మూడు రోజుల పాటు లారీని అనుసరించింది. రెండు రోజులు విజయవాడ నుంచి బొల్లాపల్లి టోల్‌ప్లాజా వరకు వచ్చే వరకు ఎవరూ ఎక్కలేదని తెలుసుకుని నిరాశతో వెళ్లిపోయారు. మూడో రోజు విజయవాడ నుంచి లారీని అనుసరించారు. ఆ రోజు గుంటూరులో స్వరూప్‌ అనే నగలు వ్యాపారి ఎక్కటం ఆయన గతంలో కూడా అదే వాహనంలో పలుమార్లు చెన్నైకు వెళ్లారని కచ్చితంగా ఆయన వద్ద డబ్బులు ఉంటాయని భావించి పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. చివరకు పోలీసులకు చిక్కారు. నిందితులు మేదరమెట్ల, కొరిశపాడు, ఒంగోలుకు చెందిన వారిగా తెలిసింది.

విశాఖలో బైక్ కొట్టేసి తునిలో చైన్ స్నాచింగ్ - "షాకింగ్ విజువల్స్"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.