VINTAGE BIKE STORY: కొన్ని దశాబ్దాల కిందట ద్విచక్ర వాహనాలు ఎలా ఉండేవి? ఎంత వేగంతో నడిచేవి? ఇవన్నీ ప్రస్తుత యువతీ యువకులకు తెలియదు. అప్పట్లో చేతక్ బండ్లు, హీరో హోండా మొదలైన ఒకటి రెండు ప్రధాన అరుదైన కంపెనీలకు చెందిన బైక్‌లు మాత్రమే ఉండేవి. కానీ అవి ఎలా ఉంటాయో చాలా మందికి తెలియవు. అయితే వాటి గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే విశాఖ నగరం రెడ్డి కంచరపాలేనికి చెందిన బసవా రవిశంకర్ రెడ్డి ఇంటికి వెళ్లి తెలుసుకోవాల్సిందే.
క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ.. త్వరలోనే హోండా ఎలివేట్, సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ రిలీజ్!
29 రకాల పాత ద్విచక్ర వాహనాలు:విశాఖపట్టణం రెడ్డి కంచరపాలేనికి చెందిన రవిశంకర్ రెడ్డి ఇంజనీరుగా విధులను నిర్వర్తించేవాడు. అయితే వృత్తిరీత్యా ఇంజనీరు అయిన ఆయనకు పాత ద్విచక్ర వాహనాల సేకరణ అంటే అమితాసక్తి. 1957 నాటి జావా బైక్, 1959 నాటి ల్యాంబ్రీటా స్కూటర్, మినీ రాజ్ దూత్, డీజిల్ బుల్లెట్, లూనా, ఇండ్ సుజికీ బైకులు.. ఇలా 29 రకాల పాత ద్విచక్ర వాహనాలు ఇందులో ఉన్నాయి. వీటిని భద్రపరచడానికి ఏకంగా తన ఇంటి సెల్లారును తీర్చిదిద్దారు. అవి తుప్పు పట్టి పోకుండా వాటి నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ వాహనాల ధ్రువపత్రాలను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. దీని కోసం సుమారు ఏటా 1.70 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. పాతవే కదా అని చెప్పి పనిచేయవు అని అనుకుంటే పొరపాటే. వాటిని దర్జాగా రోడ్డుపై నడిపించవచ్చు.
New Electric Bike In India : స్టన్నింగ్ ఫీచర్స్‌తో టోర్క్ మోటార్స్ ఈ-బైక్ లాంఛ్.. ధర ఎంతంటే?