Low pressure in the Bay of Bengal : దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. డిసెంబర్ 15 నాటికి ఇది అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది.
అరేబియా సముద్రం దక్షిణ అండమాన్ మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉంది. డిసెంబర్ 15 నాటికి ఇది అల్పపీడనంగా మారి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు, చాలా చోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే వారం మరో అల్పపీడనం- పది రోజులు కోస్తా, రాయలసీమలో వానలు
వాతావరణ మార్పులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఆకాశం మేఘామృతం అవుతుండటంతో బాపట్ల జిల్లా తీర ప్రాంత రైతుల్లో గుబులు మొదలయింది. ఇటీవల కురిసిన వర్షాలకు నగరం, రేపల్లె, చెరుకుపల్లి, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట నేల వాలింది. కొద్ది రోజుల తరువాత మరోసారి వాయుగుండం ప్రభావం ఉందని హెచ్చరికలు వస్తుండటంతో రైతులు యంత్రాలతో పంట కోయించి ధాన్యాన్ని రహదారుల పైనే ఆరబెడుతూ పట్టాలు కప్పుకుంటున్నారు. కోత కోయించిన మరి కొందరు రైతులు వడ్లు ఆరకముందే వేగంగా కుప్పలు వేసేస్తున్నారు. రైతులు అందరూ ఒకే సారి కుప్పలు వేయించేందుకు ముందుకు వస్తుండటంతో కూలీల కొరత పెరిగింది. మరో వైపు పడిపోయిన వరి ని కోసేందుకు అధికంగా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఇంత చేసి ధాన్యం అమ్ముదామంటే గిట్టు బాటు ధర లేదని, గత ఏడాది కంటే ధర భారీగా తగ్గిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. రెండో పంట వేసే పరిస్థితులు లేవని వాపోతున్నారు.
అలర్ట్ - బంగాళాఖాతంలో మరో వాయు'గండం' - ఏపీలో భారీ వర్షాలు!
కొనసాగుతున్న అల్పపీడనం - ధాన్యంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం