Government has Announced the Damage Caused in State : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది మృతి చెందగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందిన్నట్లు అధికారులు తెలిపారు. 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిళ్లిన్నట్లు వెల్లడించారు. దీంతో 2లక్షల34 వేల మంది రైతులు నష్టపోయారని అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టం : అలాగే 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందిన్నట్లు ప్రకటించారు. వరదల వలన 22 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు. వర్షం, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని తెలిపారు. 193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలో దిగాయాని, ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 228 బోట్లను రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయని తెలిపారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపినట్టు ప్రభుత్వం వివరించింది.
క్షణం క్షణం ఆందోళన - లంక గ్రామాల్ని ముంచెత్తిన కృష్ణమ్మ - Krishna Floods in Lanka Villages
క్రమంగా తగ్గుతున్న వరద ఉధృతి : ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజికి వరద నీరు ప్రస్తుతం 4,17,694 క్యూసెక్కులగా నమోదయ్యింది. 70 గేట్ల ద్వారా యథాతథంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలువలకు 500 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. రాగల 4 రోజుల్లో బ్యారేజీకి 148 టీఏంసీల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపటికి మళ్లీ ప్రకాశం బ్యారేజి కి 5.37 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తుంది. ఆ తరవాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, సెప్టెంబర్ 8 నాటికి వరద ఉధృతి 3 లక్షల క్యూసెక్కుల కు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు.