ETV Bharat / state

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి - FIVE STUDENTS DIED IN ROAD ACCIDENT

Five AP Students Died in Road Accident: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీకొనడంతో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఐదుగురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Five AP Students Died in Road Accident
Five AP Students Died in Road Accident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 10:58 PM IST

Five AP Students Died in Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.

శనివారం సెలవు రోజు కావడంతో తిరువళ్లూరు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు, తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గిద్దలూరు నితీష్ (ప్రొద్దుటూరు), బన్ను నితీష్ (విజయవాడ), యుగేశ్ (తిరుపతి), చేతన్ (తిరుపతి), రామ్మోహన్ (కర్నూలు)లు మృతి చెందగా, చైతన్య (ప్రకాశం), విష్ణు (నెల్లూరు)లకు తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన ఇద్దరు విద్యార్థులను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. వీరంతా చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు.

తీవ్ర విషాదం - రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి - ఆడుకుంటున్న సమయంలో ఘటన - Medchal Train Accident Three Died

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.