Tension at Perni Nani House in Machilipatnam : మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని తీరుకు నిరసనగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పవన్‌ను ఉద్దేశించి పేర్నినాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముట్టడికి జనసైనికులు యత్నించారు. పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నానికి వ్యతిరేకంగా జనసేన నేతలు నినాదాలు చేశారు.
జనసైనికులకు ధీటుగా పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. దీంతో పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మోహరింపుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకు దిగిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతోపాటు జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేర్ని కిట్టు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను కూడా పోలీసులు వెనక్కి పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని పేర్ని నాని హెచ్చరించారు. పవన్ కల్యాణ్‌కి, జనసేన కార్యకర్తలకు వైఎస్సార్సీపీ భయపడదని అన్నారు. సినిమాల్లో నాలుగు డ్యాన్సులు వేసి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. పవన్ కల్యాణ్‌కి ఒక సిద్ధాంతం లేదని విమర్శించారు. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారన్నారు. గతంలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూసుకోవాలని పేర్ని నాని సూచించారు.
సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri