ETV Bharat / state

రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాల్పులు - ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 44.1 డిగ్రీలు - Temperatures in Andhra Pradesh

Temperatures in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. నేడు ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా 44.1 డిగ్రీలు, మన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 43.9 డిగ్రీలు నమోదయ్యాయి. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 72 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Temperatures_in_Andhra_Pradesh
Temperatures_in_Andhra_Pradesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 8:03 PM IST

Temperatures in Andhra Pradesh: ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.1 డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 43.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్రలో 43.6 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 43.3 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 72 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడగాల్పుల తీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా సరే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Precautions From Summer: ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్​ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అయితే మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలగటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు- 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు - Summer Heat Waves in Andhra pradesh

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శుక్రవారం అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురంలో 45.6, నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలో సుమారుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఏపీలో గురువారం ఉష్ణోగ్రతలు: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 45.8 డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సుమారుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Telangana Weather: ఏపీ ఎండలు దంచికొడుతుండగా తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారడంతో ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు. హైదరాబాద్​లో శుక్రవారం నుంచే పలు చోట్ల వర్షం కురిసింది. పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షాలు మొదలయ్యాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భారత్​లో భిన్న వాతావరణ పరిస్థితులు - ఓచోట కరవు మరోచోట వరదలు - ఎందుకిలా? - Prof Raghu Murtugudde on Climate

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.