ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక వికెట్ ఔట్ - టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్ట్‌ - Telangana Phone Tapping Case - TELANGANA PHONE TAPPING CASE

Telangana Phone Tapping Case Updates : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పని చేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌ ఠాణాకు వచ్చిన ఆయన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని దర్యాప్తు బృందం రాత్రి వరకు విచారించింది. అనంతరం అరెస్ట్‌ చేశారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

telangana_phone_tapping_case_updates
telangana_phone_tapping_case_updates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 11:25 AM IST

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక వికెట్ ఔట్ - టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్ట్‌

Telangana Phone Tapping Case Updates: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు విచారించారు. ఆయన్ని ప్రశ్నించిన సమయంలో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ గేట్లు మూసేసి గోప్యత పాటించారు. సస్పెండైన డీసీపీ ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి.

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

Task Force EX OSD Radhakishan Rao Arrested : ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు రాధాకిషన్‌రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్‌ చేయగా మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు ముగ్గురూ విదేశాలకు వెళ్లినట్లు భావించిన పోలీసులు లుక్‌ఔట్‌ నోటీస్‌లు జారీ చేశారు.

అనూహ్యంగా రాధాకిషన్‌రావు గురువారం ఉదయం పోలీసుల ఎదుటికి వచ్చారు. బోయినపల్లిలోని తన ఇంటి నుంచి వచ్చిన ఆయన వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ను కలిశారు. ఈ నేపథ్యంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ప్రణీత్‌రావుకు రాధాకిషన్‌రావు ఇచ్చిన ఆదేశాలు అక్కడి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన ఆపరేషన్ల గురించి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఎవరి సూచనల మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలని ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చారని రాధాకిషన్‌రావును ఆరా తీశారు.

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ ​రావు - నేడు వికారాబాద్​ తీసుకెళ్లి విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ (TS Phone Tapping Case)సమాచారంతో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఆపరేషన్లు చేపట్టారు? హవాలా లావాదేవీల క్రమంలో నిర్వహించిన దాడుల్లో ఏం జరిగింది? పలువురు వ్యాపారస్థులను బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఐబీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గట్టుమల్లును పోలీసులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ఎదురు ప్రశ్నించడంతో ఓ ఉన్నతాధికారి తనదైన శైలిలో విచారించినట్లు ప్రచారం జరిగింది.

రాధాకిషన్‌రావు బృందంపై పలు ఆరోపణలు : హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావుతోపాటు ఆయన బృందంపై పలు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు తాము లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థులను దారికితెచ్చే బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించేవారని ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపించేవి. ఆయనపై సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆరోపణలు చేశారు. రాధాకిషన్‌రావు మల్కాజిగిరి ఏసీపీగా ఉన్న సమయంలో ఓ కాంగ్రెస్‌ నాయకుడు ఆత్మహత్యకు కారకులయ్యారనే అభియోగాలను ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం ఆ కేసు నుంచి బయటపడ్డారు.

ఉద్యోగ విరమణ పొందినా ఓఎస్డీగా విధులు : గత ప్రభుత్వ హయాంలో రాధాకిషన్‌రావు టాస్క్‌ఫోర్స్‌లో కీలకంగా వ్యవహరించారు. నగర కొత్వాల్‌గా ఎవరున్నా ప్రభుత్వ అండదండల కారణంగా ఆయనకే ప్రాధాన్యం ఉండేది. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా రెండు విడతలుగా ఆయనే ఓఎస్డీగా కొనసాగారు. దీని వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో రాధాకిషన్‌రావుపై అప్పటి కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక నివేదిక పంపించడంతో రాధాకిషన్‌రావును టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారడంతో తన పదవికి రాజీనామా చేశారు.

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక మలుపు - ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్ - PRANEETH RAO CASE updates

Begum Bazar Vendors in Phone Tapping Case: రాధాకిషన్‌రావు, గట్టుమల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే బేగంబజార్‌లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో హవాలా, గంజాయి దందాల్లో ప్రమేయమున్న వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసేవారు. ఈ నేపథ్యంలోనే వారితో ఆర్థిక లావాదేవీల బంధం కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. మరో ముగ్గురు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను కూడా ట్యాపింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోనే వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

SIB Ex DSP Praneeth Rao Case Updates : ప్రణీత్‌రావుకు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితోపాటు ఓ కానిస్టేబుల్‌ సైతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబరు 4న ఎస్‌ఐబీలో హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయడంతో పాటు వాటిని మూసీ నదిలో పారేయడంలో వీరి ప్రమేయమున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్న అదనపు ఎస్పీలు ( Praneeth Rao Case Updates) భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 2 వరకు కస్టడీ విధించింది. ప్రణీత్‌రావును పోలీస్‌ కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నమ్మలేని నిజాలు - నల్గొండలో వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసి మరీ బెదిరింపులు! - PHONE TAPPING CASE latest upadates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.