ETV Bharat / state

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపండి - తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - N Convention approach HC - N CONVENTION APPROACH HC

Telangana High Court on N Convention Demolition : అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఆ యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం పలు విషయాలను వెల్లడించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

HC on N Convention Demolition
HC on N Convention Demolition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 3:03 PM IST

Updated : Aug 24, 2024, 4:48 PM IST

Telangana High Court Interim Orders On N Convention Demolition : సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కూల్చివేతపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈక్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకముందు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం తరఫున న్యాయవాది శ్రీరఘురాం బలంగా వాదనలు వినిపించారు. కాగా హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం పలు విషయాలను వెల్లడించింది.

సినీ నటుడు అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిత్రం అప్పటి ప్రభుత్వ సర్వే ప్రకారం స్వార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో ఎన్‌ కన్వెన్షన్ నిర్మించారని పేర్కొన్నారు. 2010-12 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తైందని, అయితే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. నోటీసులు జారీచేసిన భూమి మీద మరో మూడు, నాలుగు సర్వే రిపోర్టులు సైతం సర్క్యులేషన్‌లో ఉన్నాయని, దీంతో నాగార్జున ప్రభుత్వ నోటీసులపై కోర్టుని ఆశ్రయించినట్లు తెలిపారు.

సర్కార్ ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధింపు : ఈ అంశంపై రూ.9 కోట్లు డిపాజిట్​గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని గతంలో నాగార్జున అంగీకరించినట్లు పిటిషన్​లో చెప్పుకొచ్చారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం సర్కార్ ఉత్తర్వులపై స్టే విధించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా, దానిని బేఖాతరు చేస్తూ ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టిందని పిటిషన్‌లో వెల్లడించారు.

హీరో నాగార్జునకు షాకిచ్చిన 'హైడ్రా' - ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత - N Convention demolition by HYDRA

Hydra Focus on Illegal Structures : తెలంగాణ రాజధానిలో గత కొద్దిరోజులుగా హైడ్రా సంచలనంగా మారింది. కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టిస్తూ అక్రమ కట్టడాలు నేలమట్టం చేస్తూ ప్రజా ఆస్తుల సంరక్షణే ధ్వేయంగా ముందుకు సాగుతోంది. సర్కారు భూములు, చెరువుల ఆక్రమణలపై చర్యలతో పాటు విపత్తుల నిర్వహణ కోసం రూపు దిద్దుకున్న ఈ ప్రభుత్వ సంస్థ, అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

హైదరాబాద్ మహానగరంలో 44 ఏళ్లుగా చెరువులు, కుంటల విధ్వంసాన్ని ఇటీవల వెల్లడించిన హైడ్రా నాలుగు ఏళ్లలో పరిస్థితి మరింత చేయిదాటి పోయిందని ప్రకటించింది. ఈమేరకు అక్రమ నిర్మాణాలపై సాగుతున్న పోరులో అధికార పక్షం, విపక్షం, సినీ ప్రముఖులు ఇలా ఎవరున్నా ఉపేక్షించకుండా ముందుకు సాగుతుంది. కాగా తాజాగా జరిగిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో, కూల్చివేతలపై ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా కూల్చివేశారు: నాగార్జున - Nagarjuna React on Demolish

Last Updated : Aug 24, 2024, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.