ETV Bharat / state

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని మీరెందుకు కోరలేదు? - సీబీఐని సూటిగా ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు - Avinash Reddy Bail Cancel Petition - AVINASH REDDY BAIL CANCEL PETITION

Telangana High Court Hearing on MP Avinash Reddy Anticipatory Bail Cancellation Petition: వివేకా హత్య కేసులో సాక్షులను బెదిరింపులకు గురి చేస్తుంటే నిందితుడు అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని తెలంగాణ హైకోర్టు సీబీఐని నిలదీసింది. తనకు రక్షణ లేదని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఈ కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి డిసెంబర్‌లోనే ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని న్యాయమూర్తి సీఐబీని ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 9:03 AM IST

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని మీరెందుకు కోరలేదు? - సీబీఐని సూటిగా ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Hearing on MP Avinash Reddy Anticipatory Bail Cancellation Petition : వివేకా హత్యకేసులో షరతులు ఉల్లంఘిస్తున్న నిందితుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఎందుకు కోరలేదని సీబీఐని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తుంటే మీరేం చేస్తున్నారని నిలదీసింది. తనను బెదిరిస్తున్నారని డిసెంబరులో దస్తగిరి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు.

Avinash Reddy Anticipatory Bail Cancellation Petition in Viveka Murder Case : దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ నిందితుడు అవినాష్‌రెడ్డి హైకోర్టు బెయిలు షరతులను ఉల్లంఘించారన్నారు. అవినాష్‌రెడ్డి అనుచరులు దస్తగిరి తండ్రిపై దాడి చేసి, గాయపరిచారని వివరించారు. నిందితులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని దస్తగిరిని బెదిరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు.

అవినాష్‌ను అరెస్టు చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా?: సునీత - YS Vivekananda Reddy Murder case

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్నారా? అని ప్రశ్నించగా లేదని న్యాయవాది సమాధానమిచ్చారు . సాక్షులకు రక్షణ అవసరమని, లేదంటే సాక్ష్యాలను తారుమారు చేయగలరని శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తామంటూ నిందితుడైన శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి దస్తగిరిని ప్రలోభపెట్టారన్నారు. వైద్య శిబిరం పేరిట చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి మరీ బెదిరించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అనుకూలంగా సాక్ష్యం చెప్పకుంటే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని బెదిరించారన్నారు. అవినాష్‌రెడ్డి సూచనలతోనే ఈ బెదిరింపులు సాగాయని షరతులను ఉల్లంఘించినందున ఆయన బెయిలు రద్దు చేయాలని దస్తగిరి తరఫు న్యాయవాది కోరారు.

అవినాష్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దస్తగిరి రక్షణ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, ప్రత్యామ్నాయాలపై నిర్ణయం రాకుండానే ఇక్కడ పిటిషన్‌ వేయడం సరికాదన్నారు. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించలేదన్నారు. బెయిలు రద్దు కోరే అర్హత మూడో వ్యక్తికి లేదని ఓ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇదే హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దును కోరే హక్కు దస్తగిరికి ఉంది: హైకోర్టు - Viveka Murder Case

దస్తగిరి తరఫు న్యాయవాది స్పందిస్తూ బెయిలు రద్దు కోరుతూ బాధితులు, ఇతరులు కూడా పిటిషన్‌ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సీబీఐ నిర్ణయమేంటని అడిగారు. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు రద్దు చేయాలన్న దస్తగిరి వాదనను సమర్థిస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటప్పుడు అవినాష్‌రెడ్డి బెయిలు రద్దు చేయాలని మీరే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీబీఐ ప్రభుత్వ సంస్థ అని, అనుమతులన్నీ రావడానికి కొంత సమయం పడుతుందని ఈలోగా వివేకా కుమార్తె ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారని, అందులోనే బెయిలు రద్దు చేయాలని కోరుతూ తాము కౌంటరు దాఖలు చేయనున్నామని సీబీఐ న్యాయవాది తెలిపారు.

వివేకా హత్య కేసు నిందితులతో కడప జైలు అధికారులు కుమ్మక్కయ్యారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. జైల్లో ఉన్న దస్తగిరిని కలవడానికి నిందితుల సంబంధీకుడిని ఎలా అనుమతించారన్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సాక్షులను ప్రభావితం చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు.

హూ కిల్డ్​ బాబాయ్ - నేటి వరకు దొరకని సమాధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.