ETV Bharat / state

ఐఏఎస్​లకు దక్కని ఊరట - పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు - IAS OFFICERS PETITION

తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు దక్కని ఊరట - రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్లు కొట్టివేసిన ధర్మాసనం

ias_petition_in_tg_high_court
ias_petition_in_tg_high_court (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2024, 5:03 PM IST

Telangana High Court Dismissed IAS Officers Petition: డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్‌ అధికారులు వాణి ప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌లకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. రిలీవ్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలన్ని న్యాయస్థానం ఆదేశించింది. ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌లు కోరారు.

రిలీవ్‌ చేసేందుకు 15 రోజులు గడువు ఇవ్వాలని డీవోపీటీని కోరినట్లు ఐఏఎస్‌లు వివరించారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని కోరింది. మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా అని ఐఏఎస్​లను హైకోర్టు అడిగింది. సమాఖ్య దేశంలో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది.

వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు-సేవ చేయాలని లేదా? - ఐఏఎస్​లను ప్రశ్నించిన క్యాట్​

ఈనెల 9న ఆ ఐఏఎస్​లకు డీవోపీటీ ఉత్తర్వులు : ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ తెలంగాణకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు డీవోపీటీ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ ఐఏఎస్​లు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో పిటిషన్ వేశారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ఏపీకి వెళ్లాలని క్యాట్​ తీర్పు : అయితే క్యాట్​లో విచారణ జరిపినా వీరికి ఊరట లభించలేదు. విచారణ సమయంలో క్యాట్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని, అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? అని ప్రశ్నించింది. ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని కూడా తెలిపింది. ఏపీకి వెళ్లాలన్న ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించి డీవోపీటీకి నోటీసులు జారీ చేసింది.

'సొంత రాష్ట్రాలకు వెళ్లండి' - ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ సహా పలువురి అభ్యర్థనలు తోసిపుచ్చిన కేంద్రం

తండ్రి రిటైర్​మెంట్​ ఆర్డర్​పై కుమారుడు సంతకం- నాన్న కోసం రూ.లక్షల జీతం వదిలి UPSC టాపర్​గా! - Son Signed Father Retirement Order

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.