ETV Bharat / state

క్రికెటర్‌ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం - రేవంత్​ రెడ్డి ఆదేశం - Revanth Reddy Meet Mohammed Siraj - REVANTH REDDY MEET MOHAMMED SIRAJ

Revanth Reddy Meet Mohammed Siraj : టీమిండియా క్రికెటర్​ మహమ్మద్​ సిరాజ్​ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి. ఇవాళ తెలంగాణ సీఎంని సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి సిరాజ్​ టీమిండియా జర్సీని బహుకరించారు. అనంతరం మహమ్మద్​ సిరాజ్​కు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు.

Revanth Reddy Meet Mohammed Siraj
Revanth Reddy Meet Mohammed Siraj (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 10:51 PM IST

Telangana Govt Offer to Indian Cricketer Siraj : టీ20 ప్రపంచకప్ 2024​ విజేత జట్టులోని హైదరాబాదీ క్రికెటర్​ మహమ్మద్​ సిరాజ్​కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. క్రికెటర్​ సిరాజ్​కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్​ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం సీఎం రేవంత్​ రెడ్డిని టీమిండియా క్రికెటర్​ సిరాజ్​ కలిశారు. అనంతరం హైదరాబాదీ క్రికెటర్​ను సీఎం అభినందించారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని టీమిండియా క్రికెటర్​ మహమ్మద్​ సిరాజ్ జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో​ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం రేవంత్​కు టీమిండియా జెర్సీని బహుకరించారు. టీ20 ప్రపంచకప్ 2024​ సాధించినందుకు సిరాజ్​ను సీఎం రేవంత్​ రెడ్డి అభినందించారు. ఆ తర్వాత శాలువతో హైదరాబాదీ క్రికెటర్​కు సత్కరించారు.

కాసేపు టీ20 ప్రపంచకప్​లో భారత్​ ప్రయాణం, ఫైనల్​లో విజయం, సభ్యుడిగా ఎలా సంబరాలు చేసుకున్నారు, విజయం సాధించినప్పుడు టీమిండియా ప్లేయర్లు భావోద్వేగాలను సీఎం రేవంత్​ అడిగి తెలుసుకున్నారు. ఇలా కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​, హెచ్​సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్​ సహా పలువురు ఉన్నారు.

ఇటీవల టీ20 వరల్డ్ కప్​ సాధించిన టీం ఇండియాలో మహమ్మద్ సిరాజ్ కీలకంగా వ్యవహరించాడు. మ్యాజిక్ బౌలర్ బుమ్రాతో కలిసి ప్రత్యర్థి బ్యాట్​మెన్​ను ముప్పుతిప్పలు పెట్టారు. టీం ఇండియాలో అంచలంచలుగా కీలకంగా ఎదుగుతున్నాడు. వరల్డ్ కప్ గెలుపు అనంతరం ఈ నెల 5న సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో సిరాజ్​కు హైదరాాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున వచ్చి సిరాజ్​కు స్వాగతం పలికారు. తరువాత మెహదీపట్నం నుంచి సిరాజ్ నివసించే ఈద్గా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది హాజరై సిరాజ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

'మాకు ప్రైజ్​మనీ ఇవ్వండి సార్' - 1983 వరల్డ్​కప్​ విన్నర్​ కపిల్​దేవ్​ టీమ్​​ డిమాండ్​! - T20worldcup 2024 prize Money

వరల్డ్​కప్ ప్రైజ్​మనీ- రూ.125 కోట్ల నజరానా- ఎవరెవరికి ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.