ETV Bharat / state

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా : సీఎం రేవంత్ - Young India Skill University - YOUNG INDIA SKILL UNIVERSITY

CM Revanth Announced Skill University Chairman : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీకి ఛైర్మన్​గా ఆనంద్ మహీంద్రా నియమితులు కాబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ఓ సమావేశంలో ప్రకటించారు. మూడు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తొలిసారి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో నైపుణ్యమిచ్చి, ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.

cm_revanth_announced_skill_university_chairman
cm_revanth_announced_skill_university_chairman (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 5:17 PM IST

Young India Skill University Chairman Anand Mahindra : తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఉండేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సీఎం తెలిపారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి రంగారెడ్డి జిల్లా బ్యాగరికంచె వద్ద శంకుస్థాపన చేసినట్టు సీఎం గుర్తుచేశారు. ఈ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ప్రతి ఏడాది, 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడం సహా ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

యూనివర్సిటీ ఛాన్సలర్​గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి : స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీ ఛాన్సలర్​గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. పరిశ్రమల ప్రముఖులతో పాలకమండలి ఏర్పాటు చేయనున్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ - కూటమి ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండనుంది ? - youth skills development

Telangana Young India Skill University : భవిష్యత్‌లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నట్టు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా - ఈఎస్​సీఐ భవనంలో స్కిల్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు.

"ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్​ ఉంది. యువతకు స్కిల్స్​ నేర్పించాలనే సదుద్దేశంతో కొత్త యూనివర్సిటినీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్​, దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్​ మహీంద్రాను ఈ యూనివర్సిటీకి ఛైర్మన్​గా వ్యవహరించాలని కోరాను. మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది." -రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

మహిళల ఆశలు చిదిమేసిన వైఎస్సార్సీపీ - నాలుగేళ్లుగా నిలిచిన "మహిళా ప్రగతి" కేంద్రాలు - Mahila Pragathi Pranganam guntur

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.