TDP NRI Cell Creating Jobs For AP Unemployed Youth : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని ప్రవాసాంధ్రులు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమలకు అనుగుణంగా ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తామని తేల్చిచెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ది పొంది వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు ఎన్నికల వేళ రాష్ట్రానికి వచ్చి కూటమి ప్రభుత్వం వస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ ఒక్కో తెలుగు పారిశ్రామికవేత్త దాదాపు 20 మంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తే లక్ష ఉద్యోగాల కల్పన తమకేమీ పెద్ద కష్టం కాదంటున్న ప్రవాసాంధ్రులతో ఈటీవి వీఎస్‌ఎన్ కృష్ణ ముఖాముఖి.
TDP NRI Exclusive Interview on Jobs : తెలుగుదేశం పార్టీకి మద్దతుగా టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ తమ వంతు కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు పాలనలోనే తామంతా విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడగలిగామని వారు తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని ప్రవాసాంధ్రులు హామీ ఇచ్చారు.
'15 దేశాల నుంచి 3వేల మంది వ్యాపారులు ఉన్నారు. ఒక్కో కంపెనీలో ఇరవై ఉద్యోగాలు కల్పించిగా 60 వేల ఉద్యోగాలు వస్తయి. అలాంటిది లక్ష ఉద్యోగాలు కల్పించడం చాలా తేలిక. నైపుణ్యాభివృద్ది కలిగిన వారికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎలివేటర్ కంపెనీలలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఇది తెలియక సరైన శిక్షణ లేక చాలా నష్టపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండే మహిళలకు కూడా వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉపాధి కల్పించాలని అడిగారు. దానికి సంబంధించినా అన్ని ఏర్పాట్లు సిద్దమవుతున్నాయి.'- టీడీపీ ప్రవాసాంధ్రులు
NRI Support to NDA : పరిశ్రమలకు అనుగుణంగా ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి యువతకు ఉద్యోగాకాశాలు కల్పించే ప్రణాళిక సిద్ధం చేశామని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.ఈ ఐదేళ్ల జగన్ పాలన వల్ల తామెంతో వెనకపడ్డామన్నారు. చంద్రబాబు నాయుడు పాలన అయుతే హైదరాబాద్‌కు దీటైన నగరాన్ని నెలకొల్పోవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు.