TDP Nara Lokesh Tweet on MLA RK: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి (Alla Ramakrishna Reddy) పేదల ఇళ్లు కూల‌్చడం తప్ప వారికి సేవ చేయడం తెలియదని నారా లోకేశ్ విమర్శించారు. ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు పది మందికి సాయపడాలన్న మనసు కూడా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తాడేపల్లికి చెందిన దివ్యాంగ సోదరుడు కోడె కోటేశ్వరరావు సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొద్దినెలల క్రితం తోపుడుబండి ఇచ్చానన్నారు.
తోపుడు బండి ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం తాడేపల్లికి వచ్చిన లోకేశ్ దివ్యాంగుడు కోటేశ్వరరావును చూసి అప్యాయంగా పలకరించారు. మీరు ఇచ్చిన తోపుడు బండితో పండ్ల వ్యాపారం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని లోకేశ్‌కు చెప్పారు. విభిన్న ప్రతిభావంతుడు కోటేశ్వరరావు కోరిక మేరకు నారా లోకేశ్ ఆయనతో సెల్ఫీ దిగారు. వాటిని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇలాంటి వేలాది మందికి గత అయిదేళ్లుగా తాను చేయూతనిచ్చానని వెల్లడించ్చారు. మహిళల స్వయం ఉపాధి శిక్షణతో పాటు కుట్టుమిషన్లు ఇచ్చానని తెలిపారు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటుచేశానని గుర్తు చేశారు. 29 సంక్షేమ పథకాలను అయిదు సంవత్సరాలుగా సొంత నిధులతో అమలుచేస్తున్నానని పేర్కొన్నారు. పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే తాను చేసిన పనుల్లో పదోవంతైనా సాయం చేశారా అని ప్రశ్నించారు.
మంగళగిరి ఎమ్మెల్యేగా ఆర్కే (Mangalagiri MLA RK) రెండో సారి గెలిచిన తర్వాత తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటివద్ద ఇరుకుగా ఉందని పేదల ఇళ్లు కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం, ఆత్మకూరులో రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లను పంపి పేదల బతుకులను రోడ్డు పాల్జేశారని విమర్శించారు. సేవచేయడమంటే కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం, పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న పేదల ఇళ్లు కూల్చివేయడం కాదు కరకట్ట కమలహాసన్ అని ఎద్దేవా చేశారు.
ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు - జగన్ మహానటుడు : నారా లోకేశ్ - Lokesh Election Campaign
Nara Lokesh Tweet on CM YS Jagan: సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్‌ని ఫూల్ చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు. జగన్ నాటకం, జగన్ మాయ, జగన్ మోసం, అధికారం కోసం జగన్ ఏళ్లుగా ఆడుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఇవి అంటూ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. జగన్ మోసాలు జనానికి తెలిశాయన్నారు. ఈ సారి జనం చేతిలో జగన్‌కి గుణపాఠం తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ అజెండా : లోకేశ్ - Lokesh Election Campaign