TDP Leaders Media Conference in Visakhapatnam: దేశంలో ప్రముఖ సంస్థలు సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అంటున్నాయని టీడీపీ నేతలు అన్నారు. విశాఖలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
Ganta Srinivasa Rao: కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన టీడీపీ నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. బొత్స, సుబ్బారెడ్డి ఇతర వైసీపీ నేతల మాటలు, చేష్టలు చూస్తుంటే నవ్వు వస్తుందని అన్నారు. ఈ నెల 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు కానీ జూన్ 9న రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు అన్నారు.
Somireddy Chandramohan Reddy Comments: జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్ని సీట్లు వస్తున్నాయో జగన్ చెబితే ఐప్యాక్ టీమ్ చప్పట్లు కొడుతోందని కాని వైసీపీకి ఎన్నిసీట్లు వస్తాయో చెప్పాల్సింది ఐప్యాక్ టీమ్ కదా అని ఎద్దేవా చేశారు. వైద్య శాఖ అనారోగ్య స్థితిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఎవరో కూడా ప్రజలు మరిచిపోయారని అన్నారు. వైసీపీ నేతల్లా తాను అవినీతి చేయలేదని వారి ఆరోపణలపై నెల్లూరులో సమాధానం చెబుతానని సోమిరెడ్డి తెలిపారు.
అనంతపురంలో 'ఉగ్ర' కలకలం - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ - NIA arrested an IT employee
Raghurama Krishnaraju on Jagan: ఈవీఎంల ధ్వంసంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని ఉండి శాసనసభ కూటమి అభ్యర్థి రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుందని అన్నారు. ఆ పార్టీ దారుణ పరాజయాన్ని చూడబోతుందని తెలిపారు. బటన్ నొక్కడమే గానీ ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. సీఎస్‌ను మారిస్తే అన్నీ సర్దుకుంటాయని రఘురామ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ చట్ట ప్రకారం ఇస్తామని రఘురామ తెలిపారు.