ETV Bharat / state

ఈసీ ఆదేశాలను సాకుగా చూపి వైసీపీ ప్రభుత్వం 31 మంది ప్రాణాలను బలితీసుకుంది : కూటమి నేతలు - TDP LEADERS COMPLAIN TO CEO - TDP LEADERS COMPLAIN TO CEO

TDP Leaders Complaint to CEO From Pension Issue : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కూటమి నేతలు కలిశారు.పెన్షన్​లను వాలెంటీర్ల ద్వారా ఇవ్వొద్దని ఈసీ చెప్పిందని, దీన్ని సాకుగా చూపి అమాయకులైన 31 మంది వృద్దుల ప్రాణాలను వైఎస్సార్సీరీ ప్రభుత్వం బలి తీసుకుందని గుర్తుచేశారు. మరోసారి సీఎస్ జవహర్ రెడ్డి వృద్దులను హత్య చేసే నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవాలని సీఈఓని కోరారు.

TDP_Leaders_Complaint _to_CEO_From_Pension_Issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 10:14 PM IST

TDP Leaders Complaint to CEO From Pension Issue : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కూటమి నేతలు కలిశారు. సామాజిక భద్రత పెన్షన్​లు వాలెంటీర్ల ద్వారా ఇవ్వొద్దని ఈసీ చెప్పిందని, దీన్ని సాకుగా చూపి 31 మంది ప్రాణాలు వైఎస్సార్సీరీ ప్రభుత్వం బలి తీసుకుందని గుర్తుచేశారు. మరోసారి సీఎస్ జవహర్ రెడ్డి వృద్దులను హత్య చేసే నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపకు చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వాడిగా మీడియాలో మాట్లాడించి వైసీపీ నేతలు జనాన్ని నమ్మిస్తున్నారని ఆక్షేపించారు. అతను అసలు తెలుగుదేశం వ్యక్తి కాదు అని సీఈఓకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని సీఈఓ తెలిపారని గుర్తుచేశారు.

ఈసీ ఆదేశాలను సాకుగా చూపి వైసీపీ ప్రభుత్వం 31 మంది ప్రాణాలను బలితీసుకుంది : కూటమి నేతలు

వాలంటీర్లు వైసీపీ పోలింగ్ ఏజెంట్లు- మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

అలాగే వాలంటీర్​లు రాజీనామా చేసాక ఏజెంట్​లుగా కూాడా కూర్చోవడానికి వీలు లేకుండా చూడలాని ఎన్నికల అధికారిన కోరినట్లు తెలిపారు. నెల్లూరులో కాకానీ గోవర్దన్ రెడ్డికి చెందిన మద్యం డంప్ దొరికిందని వెల్లడించారు. అలాగే గత ఎన్నికల్లో దొంగ సారా కేస్ కూడా ఆయనపై నమోదు అయ్యిందని తెలిపారు. ఎన్ని తప్పులు చేస్తున్న అధికారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నాడని వర్ల రామయ్య విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలయ్యాక కూడా అధికార పార్టీ దాడులు ఆగడం లేదని ఆరోపించారు. కొందరు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ జవాబుదారీ అని కేవలం వైసీపీకి మాత్రమే కాదని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన వివిధ హింసాత్మక ఘటనలపై చర్యల కోసం డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన ప్రతిపక్ష నేతలు ఎవరికికీ అపాయింట్‌ మెంట్‌ ఇవ్వటం లేదని ఆరోపించారు. అందుకే ఆయనకు ఇవ్వాల్సిన వినతి పత్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇచ్చామని వర్లరామయ్య స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలకు డీజీపీ అపాయింట్‌ మెంట్‌ లేదు- అందుకే సీఈఓకి ఫిర్యాదులు: టీడీపీ నేతలు

అలాగే రాష్ట్రంలో ఇప్పటికి చాలా మంది పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారంతా పోలీసు మాన్యువల్ ప్రకారం, రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని కోరుతున్నా వారిలో మార్పు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఒక దళిత బిడ్డ దిల్లీ వెళ్లి బొటనవేలు కోసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనటానికి లక్ష్మీ ఉదంతమే ఉదాహరణని వర్ల రామయ్య అన్నారు.

పోలింగ్ ఏజెంట్లుగా పని చేయకూడదనే కుట్ర- టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.