TDP Leader Narayana Allocated 10 Crores for TDP Activists Welfare: టీడీపీకి ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనూ సుశిక్షుతులైన కార్యకర్తలు ఉన్నారంటే అతిశయోక్తికాదు. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో అనేక సమస్యలకు ఎదురీది వైసీపీ రాక్షస క్రీడలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి నారాయణకు టీడీపీ కార్యకర్తలు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ వారికి ఏం ఇచ్చింది అనేదానికన్నా పార్టీకి మేము వెన్నుదన్నుగా నిలుస్తామని నిరూపించారు నెల్లూరు నగర నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలకు జీవితాంతం తోడుగా ఉంటానంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ భరోసా కల్పించారు. చదువులోనూ, ఉద్యోగాల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పడమే కాకుండా వాటిని ప్రారంభించారు.
రాజకీయాల్లో విమర్శలు వద్దు, అభివృద్ధి ముద్దు: నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి మాజీ మంత్రి పొంగూరు నారాయణ (TDP leader Ponguru Narayana). నారాయణ కళాశాలల (Narayana Colleges) అధినేత. రాజకీయాల్లో విమర్శలు వద్దు, అభివృద్ధి ముద్దు అంటారు. అందుకనే ఆయన కోసం టీడీపీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమించారు. సుమారు 40 వేలకుపైగా ఆధిక్యంతో గెలుస్తారనే సర్వేలు కూడా చెబుతున్నాయి. పోలింగ్ అయిపోయినా కార్యకర్తలతోనే కలిసి ఉన్నారు. తన కోసం ఇంతగా శ్రమించిన టీడీపీ కార్యకర్తల కోసం తాను ఏదైనా చేయాలని నిర్ణయించుకుని కార్యకర్తల సమావేశంలో సంక్షేమ నిధిని ప్రకటించారు.
సంక్షేమ నిధిని సేకరించేలా ప్రణాళిక: కుటుంబ సభ్యులు సంపాదనలో నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యకర్తలకు 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నట్లు తెలిపారు. నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, షరణీల నుంచి సంక్షేమ నిధిని సేకరించేలా ప్రణాళికను ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న నిర్ణయం అని నారాయణ తెలిపారు. ఇందుకోసం కార్యకర్తల కోసం గుర్తింపు కార్డులు తయారు చేస్తున్నారు. కార్యకర్తల పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం అందించడం, నిరుద్యోగ యువతకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో శిక్షణ ఇవ్వడం, ఆరోగ్యసేవలు అందించనున్నారు. ఈ ఆలోచన కార్యకర్తలకు ఎంతో భరోసా కలిగిస్తుందని నారాయణ తెలిపారు.
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - సిబ్బందికి అధికారుల సూచనలు - Votes Counting Process