ETV Bharat / state

డీజీపీ,సీఎస్‌ను బదిలీ చేయాలి- సమస్యాత్మక నియోజకవర్గాల్లో పులివెందుల, కుప్పంను చేర్చాలి:కనకమేడల - CS jawahar reddy Behavior

TDP Leader Kanakamedala Ravindra Kumar: రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగాలంటే డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాల్సిందేనని టీడీపీ నేత కనకమేడల పునరుద్ఘాటించారు. జగన్‌ ఏది చెబితే అదే శాసనమంటూ కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన నేరాలపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని, స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవచ్చని విధంగా ప్రజలకు ఈసీ భరోసా కల్పించాలని రవీంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు.

TDP Leader Kanakamedala Ravindra Kumar
TDP Leader Kanakamedala Ravindra Kumar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 3:05 PM IST

TDP Leader Kanakamedala Ravindra Kumar : రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగాలంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy), సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy)ను వెంటనే బదిలీ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై దాడుల విషయంలో ఈసీ అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ఏది చెబితే అదే శాసనమంటూ కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ, సీఎస్‌ను బదిలీ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జరిగిన నేరాలపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన నేరాలపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

పింఛన్ల పంపిణీలో వైఎస్సార్సీపీ కుట్రలు - తెలిసినా స్పందించరేం సీఈఓ గారు? - Mukesh Kumar Meena on Pension Issue

వైఎస్సార్సీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశం : రాష్ట్రంలో కేవలం 14 నియోజకవర్గాలనే సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించిందని, అందులో పులివెందుల, కుప్పం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కుప్పంలో హింసాత్మక ఘటనలు చేస్తూ వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నామని తెలిపారు. కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కావున కుప్పంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

వైఎస్సార్సీపీ ముసుగులో సీఎస్ జవహర్ రెడ్డి! - పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా కుట్ర? - Door To Door Pension Distribution

రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాలను గుర్తించి స్పెషల్‌ ఫోర్స్‌ ఇవ్వాలని,ఇతర రాష్ట్రాల నుంచి అబ్జర్వర్లను పంపించి ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణంతా వెబ్‌కాస్టింగ్‌ చేయాలని కోరారు. స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవచ్చని ప్రజలకు ఈసీ భరోసా కల్పించాలని అన్నారు.

వైఎస్సార్సీపీకి వంత పాడేలా జవహర్‌రెడ్డి జగన్నాటకం - బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం - CS Jawahar Reddy Plan on Pensions

ఎన్నికలు సజావుగా జరిగాలంటే డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి:కనకమేడల రవీంద్రకుమార్‌ (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.