ETV Bharat / state

మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు - ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ - Atchannaidu on Visakha incident - ATCHANNAIDU ON VISAKHA INCIDENT

Atchannaidu on Visakha incident: విశాఖలో ఓ కుటుంబంపై వైఎస్సార్సీపీ నేతల దాడి ఘటనపై వార్తలు ప్రసారం చేసిన మీడియాపై పోలీసులు కేసు పెట్టడంపై, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి టీడీపీ నేత అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, వార్తను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

Atchannaidu
Atchannaidu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 4:34 PM IST

Atchannaidu on Visakha incident: విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం, డీజీపీకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి అచ్చెన్న తీసుకెళ్లారు.

మీడియాపై కేసులు ఎత్తేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుందని, ఈ క్రమంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశాఖలో పోలీసులు మీడియాపైనే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

విశాఖపట్నంలోని కంచరపాలెంలో వైఎస్సార్సీపీకి ఓటు వేయలేదన్న కారణంతో మహిళలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయలేదన్న కారణంతోనే తమపై దాడి జరిగిందని బాధితులు చెప్తున్నారని గుర్తు చేశారు. బాధితులు చెప్పిన విషయాన్నే మీడియా కూడా ప్రచురించిందని, ఈ ఘటనపై విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి దాడి ఘటనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు.

గులకరాయి డ్రామా గూడు పుఠానీ బయటపెడతాం : అచ్చెన్నాయుడు - TDP Acchennayudu Fires on CP

బాధితుల గళం వినిపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి సిబ్బందితో పాటు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుపైనా కేసులు నమోదు చేశారని అచ్చెన్న తెలిపారు. దాడి ఘటనను మీడియా ద్వారా రిపోర్ట్ చేయడమే నేరమన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారని అచ్చెన్న మండిపడ్డారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. విశాఖలో ఎన్నికల అనంతరం హింసను అదుపుచేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ కేసులతో మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేసిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఓటమి భయం వైఎస్సార్సీపీ నేతలను నరరూప రాక్షసులుగా మార్చేసింది- దాడులపై మండిపడ్డ లోకేశ్, టీడీపీ నేతలు - TDP Condemn YSRCP Leaders Attack

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.