ETV Bharat / state

పట్టాలెక్కిన పరిశోధనలు- ఉద్దానం బాధతులకు కూటమితో ఊరట - kidney disease in Uddanam area - KIDNEY DISEASE IN UDDANAM AREA

Kidney Disease in Uddanam : గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు వైద్యం గాలిలో దీపంలా మారింది. అందనంత దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

kidney_disease_in_uddanam
kidney_disease_in_uddanam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 5:18 PM IST

Kidney Disease in Uddanam : ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో ఆగిపోయిన పరిశోధనలను తిరిగి పట్టాలెక్కించింది. వ్యాధి మూలాలపై 2014-19 మధ్య పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన జార్జ్‌ సంస్థ బృందం కొనసాగిస్తోంది. దీనికి తోడ్పాటు అందించేందుకు కొలంబియా విశ్వవిద్యాలయం ప్రతినిధి, పర్యావరణ రసాయన నిపుణుడు ప్రొఫెసర్‌ లెక్స్‌ వన్‌గీన్‌ పలాస వచ్చారు. ఆయనతో ముఖాముఖి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రశ్న: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యల బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రభుత్వం కూడా వ్యాధి నియంత్రణకు కృషి చేస్తోంది. పరిశోధనలకు మెండుగా నిధులు కేటాయిస్తోంది. కిడ్నీ సమస్యలపై మీ పరిశోధన ఎలా ఉండనుంది?

జవాబు : యూఎస్‌ నుంచి తెచ్చిన అధునాతన పరికరాలు ఇక్కడి తాగునీరు, మట్టి, ధూళి నమూనాలను సేకరించడానికి ఉపయోగపడతాయి. శాంపిళ్ల ద్వారా ఇక్కడ సీసం వంటి విషపూరిత లోహాలు, లేదా ప్రమాదకరమైన పురుగుమందుల ఆనవాళ్ల ఆచూకీని కనిపెట్టొచ్చు. ఇవి ఎక్కువగా ఉన్నట్లు తేలితే వ్యాధిగ్రస్తుల అనారోగ్యానికి అదేమైనా కారణమా అనే విషయంపై పరిశోధన చేస్తాం. పర్యావరణానికి, వ్యాధికి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా కష్టమైన పని. జన్యుపరమైన అంశాలు సహా అనేక విషయాలు వ్యాధి వ్యాప్తికి కారణం కావొచ్చు. ఓ క్రమ పద్ధతిలో పరిశోధన చేస్తున్నాం.

ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital

ప్రశ్న: ఇలాంటి పరిశోధనలు, అధ్యయనాలు గతంలో చేసిన అనుభవం మీకుందా?

జవాబు : ఇలాంటి పరిశోధనల్లో రెండు సార్లు పాల్గొన్నా. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన అధ్యయనం అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థతో జరిగిన ఒప్పందంలో భాగం. ఇలాగే 5 మధ్య అమెరికా దేశాల్లోనూ ఈ ప్రక్రియ సాగుతోంది. వీటిలో ఎల్‌ సాల్వడార్‌, కోస్టారికా దేశాల్లో చేపట్టిన పరిశోధనల్లో పాల్గొన్నా. సరిగ్గా అలాంటి బృందంతోనే ఇక్కడ కూడా అధ్యయనం చేపట్టాం. ఉద్దానం ప్రాంతంలో వీలైనంత త్వరగా ఫలితాలు రాబట్టడానికి వేర్వేరు దేశాల్లో అధ్యయనం చేసిన అనుభవం సహకరిస్తుందని నమ్ముతున్నాం.

ప్రశ్న: ఎంతకాలం పాటు ఈ పరిశోధన సాగనుంది?

జవాబు : కిడ్నీ సమస్యలపై చాలా ఏళ్ల క్రితమే పరిశోధనలు మొదలయ్యాయి. మొదటిసారిగా దాదాపు ఐదేళ్ల క్రితం రాతపూర్వకంగా ప్రతిపాదనలు చేశారు. వేర్వేరు దేశాల్లో చేసిన అధ్యయనాల సమాచారం సాయంతో రాబోయే 5-10 ఏళ్లలో పరిశోధన పూర్తిచేయొచ్చని ఆశిస్తున్నా.

ప్రశ్న: ఈ పరిశోధనలో ఎలాంటి సాంకేతికతను వినియోగించనున్నారు?

జవాబు : సరళంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉపయోగించే పరికరాలతో నీటిలోని నైట్రేట్‌ మోతాదు వంటివి కనుగొంటాం. వ్యాధి ప్రబలడానికి ఇదేమైనా కారణమా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో బాధితుల ఎదుటే ప్రయోగం చేసి తేలుస్తాం. అలాగే ఈ నీరు, పురుగుమందుల నమూనాలను అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీకి పంపి అధునాతన పద్ధతుల్లో పరిశోధనలు చేస్తాం.

ప్రశ్న: కొన్నేళ్ల క్రితం జార్జ్ ఇన్‌స్టిట్యూట్‌ బృందం ఇక్కడ పరిశోధనలు చేసి కొంత ప్రాథమిక సమాచారాన్ని కూడా సేకరించారు. ఆ వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఒకవేళ ఉంటే అది మీకు ఎంత మేరకు ఉపయోగపడనుంది?
జవాబు : కిడ్నీ సమస్యపై జార్జ్‌ యూనివర్సిటీ బృందం చేసిన అధ్యయనం వ్యాధి వ్యాప్తికి కారణంపై ఓ ముగింపునకు రాలేదు. అందుకే మా పరిశోధన పూర్తి కావాలంటే మరో 5-10 ఏళ్ల సమయం పడుతుంది.

ప్రశ్న: స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తోంది?
జవాబు : పలాసకు చేరుకున్నప్పటి నుంచి ఇక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు చక్కగా ఆదరిస్తున్నారు. జార్జ్‌ యూనివర్సిటీ బృందం అద్భుతంగా పనిచేస్తోంది. అధ్యయనంలో పాల్గొంటున్న వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలు సేకరించాం. ఇక్కడి ప్రజలు కూడా మా పరిశోధనల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నారు. జీడి పరిశ్రమలకు తీసుకెళ్లి వారు పనిచేసే ప్రాంతాలను మాకు చూపించారు. ఇక్కడి ప్రజలతో కలిసి ఈ కీలకమైన అధ్యయనం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాం.

హాస్పిటల్ పూర్తయ్యి.. ఉద్దానం కిడ్నీ బాధితుల తలరాత మారేది ఎప్పుడో..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.