ETV Bharat / state

రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం - ఇకపై అమరావతే రాజధాని - విశాఖను ఆర్థిక రాజధానిగా చేసుకుందాం : చంద్రబాబు - Chandrababu oath Ceremony As cm - CHANDRABABU OATH CEREMONY AS CM

Chandrababu Oath Ceremony As CM: అందరి సహకారంతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ ఎన్డీయే పక్షాల నేతలు వస్తున్నారన్నారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని, అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని వెల్లడించారు.

Chandrababu Oath Ceremony As CM
Chandrababu Oath Ceremony As CM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 11:58 AM IST

Updated : Jun 11, 2024, 1:54 PM IST

రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం - ఇకపై అమరావతే రాజధాని - విశాఖను ఆర్థిక రాజధానిగా చేసుకుందాం : చంద్రబాబు (ETV Bharat)

Chandrababu Oath Ceremony As CM : రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉంది. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పని చేశారని కొనియాడారు ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదని అన్నారు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని, ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం : జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందిందని, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల దిల్లీలో అందరూ గౌరవించారని, ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగిందని అన్నారు. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనని కొనియాడారు. తాను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారని, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారని, బీజేపీ, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నామని, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేశామని స్పష్టం చేశారు.

'గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం'- పవన్‌ ప్రతిపాదనకు కూటమి ఏకగ్రీవ ఆమోదం - Chandrababu as CM candidate

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం : అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారని చంద్రబాబు తెలిపారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని, రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారని తెలిపారు. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని గుర్తు చేశారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లామని, ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, సంక్షోభంలో ఉందని, అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు అప్పులపాలయ్యారని, పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితని, కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని, అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని చంద్రబాబు వెల్లడించారు.

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ - Janasena Party Legislature Leader

మనది వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ : కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కిందని చంద్రబాబు తెలిపారు. ముగ్గురు ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉండే అవకాశం వచ్చిందని అన్నారు. రామ్మెహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మకు క్యాబినెట్‌లో చోటు కల్పించారని గుర్తు చేశారు. సాధారణ వ్యక్తిగా ఉన్న శ్రీనివాస వర్మకు బీజేపీ ఎంపీ టికెట్‌ ఇచ్చినపుడే ఆశ్చర్యం కలిగిందని, ఆ తర్వాత ఆరా తీస్తే పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని తెలిసిందని, సామాన్య కార్యకర్తను గుర్తించిన పార్టీ బీజేపీ అని అన్నారు. టీడపీ, జనసేన కూడా అలా చేస్తున్నాయని, పదేళ్ల మోదీ పరిపాలన దేశప్రతిష్ఠను పెంచిందని కొనియాడారు. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు తీసుకొచ్చిందని, మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగబోతోందని తెలిపారు. మోదీ కల వికసిత్‌ భారత్‌- 2047. మనది వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ ఈ లక్ష్యంతో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.

నా శపథాన్ని ప్రజలు గౌరవించారు : తమకు లభించింది విజయం కాదని ప్రజలకు సేవ చేసే బాధ్యత అని అన్నారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతాననే శపథాన్ని ప్రజలు గౌరవించారని తెలిపారు. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని ఆకాంక్షించారు. పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దామని అన్నారు. అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సీఎం కూడా మామూలు మనిషేనన్న చంద్రబాబు, సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదని తెలిపారు. తన కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబు సూచించారు.

ముఖ్యమంత్రిగా రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఏర్పాట్లు ముమ్మరం - Chandrababu Oath Ceremony as cm

Last Updated : Jun 11, 2024, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.