Tahsildar Ramanaiah Murder Case Accused Arrested: తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావుగా పేర్కొన్నారు. ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో చెన్నైలో అదుపులోకి తీసుకున్నామన్నారు. స్థిరాస్తి లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు సీపీ వెల్లడించారు. నిందితుడి ఆర్థిక లావాదేవీలు ఆరా తీస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రమణయ్య హత్య కేస్‌లో నిందితుడి అరెస్ట్: విశాఖలో తహసీల్ధారు రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారావు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ రవిశంకర్ మీడియాతో వెల్లడించారు. విశాఖ పోలీసు బృందం చెన్నై నగర సమీపంలో నిందితుణ్ణి అదుపులో తీసుకున్నట్టు చెప్పారు. ఏసీపీ నేతృత్వంలో తమిళనాడుకు ఒక బృందాన్ని పంపినట్టు సీపీ చెప్పారు. ఆ బృందమే నిందితుణ్ణి పట్టుకున్నారని చెప్పారు. జాయింట్ సీపీ ఫకీరప్ప ఆధ్వర్యంలో కేస్ దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.
భూవివాదాలు-హత్యలకు తెగబడుతున్న అక్రమార్కులు - ఎమ్మార్వో హత్యతో అధికారుల్లో కలవరం
చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు: హత్య చేసిన మరుసటి రోజు నిందితుడు విశాఖ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లాడని సీపీ రవిశంకర్ తెలిపారు. చెన్నై టికెట్ తీసుకున్న, బెంగుళూరులో దిగి ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చిఅక్కడ నుంచి చెంగల్ పట్టు వెళ్లారని చెప్పారు. చెంగల్ పట్టు నుంచి బస్ ద్వారా చెన్నై వెళ్తుంటే విశాఖ నుంచి వెళ్లిన పోలీసులు పట్టుకున్నారని సీపీ పేర్కొన్నారు. నిందితున్ని విశాఖకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో గంగారావును విచారిస్తున్నట్టు చెప్పారు.
హత్యకు భూ మాఫియాయే కారణం: స్థిరాస్తి లావాదేవీలే హత్యకు దారి తీసిన మాట వాస్తవమే అని సీపీ రవిశంకర్ తెలిపారు. స్థిరాస్తి ధరలు పెరగడం, భూ మాఫియా పెరిగే సంఘటనలు దృష్ట్యా, వాటిని అదుపు చేసేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు సీపీ తెలిపారు. ఇప్పటికి రెవెన్యూ అసోసియేషన్ రక్షణ విషయంలో వినతి ఇచ్చారని చెప్పారు. నిందితుడు సుబ్రమణ్యం గంగారావు ఒక స్థానిక స్థిరాస్తి సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడని అతని మీద విజయవాడ, హైదారాబాద్‌లో చీటింగ్ కేసులో నమోదైనట్లు సీపీ తెలిపారు.
బీమా సొమ్ము కోసం హర్రర్ సినిమాను తలదన్నే ప్లాన్ - పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు
ఇదీ జరిగింది: విశాఖ జిల్లా చినగదిలి రూరల్ తహసీల్దారుగా విధులు నిర్వహించిన సనపల రమణయ్యపై శుక్రవారం రాత్రి ఆయన నివాసం వద్ద మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అనే వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడివున్న రమణయ్యను ఆయన బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ. విశాఖ కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్స్ అపార్టుమెంట్ లో ఆయన నివాసం ఉంటున్నారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన హత్యకు గురయ్యాడు. రియల్ ఎస్టేట్, భూవివాదాలే తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణమని సీపీ రవిశంకర్ తెలిపారు. హత్య కేసు నిందితుడిని గుర్తించిన పోలీసులు చెన్నైలో మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అదుపులోకి తీసుకున్నారు.