Tadipatri Election RO Rambhupal Reddy Leave: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్‌రెడ్డి ఎన్నికల అధికారుల అనుమతితో 2 రోజులు సెలవు తీసుకున్నారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు, మరుసటి రోజు ఘటనలపై విచారణ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు విధులు కొనసాగించాలని అధికారులు చెబుతున్నా ఆరోగ్యం బాగాలేదని సెలవు కావాలంటూ అధికారులకు రాంభూపాల్‌రెడ్డి అభ్యర్థించారు. అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడికి గురవుతుండటంతో ఎన్నికల విధుల నుంచి తప్పించాలని అధికారులను ఆర్వో అభ్యర్థిస్తున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో ఆర్వో చేరడంపై అధికారుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయన సెలవు పెట్టడం చర్చనీయాంశమైంది. తనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆర్వో ఇది వరకే పైఅధికారులను అభ్యర్థించారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగించాలని అధికారులు చెప్పారు. దీంతో ఆరోగ్యం బాగాలేదని చెప్పి 2 రోజులు సెలవు పెట్టారు.
ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అధికారులు నిష్పాక్షికంగా పనిచేయాల్సి ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల ఆర్‌ఓలు పోలింగ్ ముందు నుంచే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అధికారంలో ఉన్నది తమ పార్టీ అని తాము ఏం చెబితే అదే జరగాలని అధికార నేతలు అక్కడి ఆర్‌ఓలను హెచ్చరిస్తున్నారు. తమ మాటలు వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. రాయలసీమలోని పలుచోట్ల కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
దీంతో కొందరు రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలో తెలియక కలెక్టర్ స్థాయిలో ఉన్న వారైనా తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారన్న ఆశతో జిల్లా ఎన్నికల అధికారులను కలిసి తమపై అధికారపార్టీ ఒత్తిళ్లు లేకుండా చూడాలని కోరుతున్నారు. తాడిపత్రి, తిరుపతి తదితర ఘటనల నేపథ్యంలో ఆర్‌ఓల్లో భయాందోళనలు మొదలయ్యాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనే ఆందోళన వారిలో నెలకొంది. ఇప్పటి నుంచే వైసీపీ అభ్యర్థుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని పీవో, సిబ్బందిపై ఈసీ వేటు - PO and Staff Suspend
ఐఏఎస్ కన్ఫర్మెంట్ను వాయిదా వేయాలి - యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ - Chandrababu Letter to UPSC Chairman