ETV Bharat / state

ఏపీలో ఇసుక అక్రమ త‌వ్వకాలు వెంటనే నిలిపివేయాలి - సుప్రీంకోర్టు ఆదేశం - SC on Illegal Sand Mining in AP - SC ON ILLEGAL SAND MINING IN AP

Supreme Court Orders to Stop Illegal Sand Mining: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక త‌వ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలన్న సుప్రీం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

SC on Illegal Sand Mining in AP
SC on Illegal Sand Mining in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 11:56 AM IST

Updated : May 10, 2024, 12:22 PM IST

Supreme Court Orders to Stop Illegal Sand Mining: ఏపీలో అక్రమ ఇసుక త‌వ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలని తెలిపింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినందున నిలిపివేశారా లేదా తనిఖీలు చేయాలని కేంద్రానికి ఆదేశం ఆదేశించింది.

అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మీ చర్యలు అన్ని కాగితాలపైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో కనిపించవు అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ వెంటనే ఆపాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలను ఉపయోగించవద్దు అని గత నెల 29న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల తర్వాత కూడా అక్రమ మైనింగ్‌ చేపట్టారని ఎన్జీఓ నేత నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. తేదీ, సమయం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫొటోలను సుప్రీంకోర్టు ముందు ఉంచారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తవ్వకాల నిలిపివేతకు తీసుకున్న చర్యలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. వచ్చే గురువారం నాటికి అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని తెలిపింది. నాగేంద్ర పేర్కొన్న ప్రదేశాల్లో తవ్వకాలు నిలిపేశాకే నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే గురువారం చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఇసుక అక్రమ తవ్వకాలు - కోడ్​ ఉన్నా ఆగని దోపిడీ - YCP LEADERS ILLEGAL SAND MINING

Supreme Court on Sand Mining: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23వ తేదీన ఎన్జీటీ ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, జైప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని గత నెల 29వ తేదీన జరిగన విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున మరికొంత సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. ఎలక్షన్స్ కంటే పర్యావరణమే ముఖ్యమని, గడువు పొడిగిస్తూ వెళితే అధికారులు నిద్రపోతారని, అక్రమంగా తవ్వకాలు కొనసాగుతాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజాగా నేడు జరిగిన విచారణలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం, క్షేత్రస్థాయిలో మీ చర్యలు కనిపించవని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదే విధంగా ఇసుక అక్రమ త‌వ్వకాలు వెంటనే నిలిపివేయాలని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మూడేళ్లలో 3 వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ - వైఎస్సార్సీపీ ముఠా మాస్టర్ ప్లాన్ - Sand Mining in Andhra Pradesh

Last Updated : May 10, 2024, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.