ETV Bharat / state

అస్సాంలో ఒంగోలు టీచర్​ హత్య - తరగతి గదిలో కత్తితో పొడిచిన విద్యార్థి - Student Stabs Teacher to Death - STUDENT STABS TEACHER TO DEATH

Student Stabs Teacher to Death in Assam : విద్యాబుద్ధులు నేర్పిన టీచర్​ను తరగతి గదిలోనే హతమార్చిన సంఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్​బాబు ప్రాణాలు కోల్పోయారు

teacher_murder
అస్సాంలో ఒంగోలు టీచర్​ హత్య - తరగతి గదిలో కత్తితో పొడిచిన విద్యార్థి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 1:56 PM IST

Student Stabs Teacher to Death in Assam : అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగును నింపేవారే టీచర్​. అలాంటి టీచర్​కు పురాణాలు సైతం పెద్దపీట వేశాయి. పిల్లలు తప్పు చేస్తే ఓ అమ్మలాగా, నాన్నలాగా దండించే హక్కు టీచర్​కు ఉంది. విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ భావిభారత పౌరులుగా తయారు చేస్తారు. వారి భవిష్యత్తు బాగుపడాలని నిరంతరం శ్రమిస్తారు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే మందలిస్తారు. అలా చేసినందుకు ఓ టీచర్​ను​ అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది

AP Teacher Murder in Assam : విద్యాబుద్ధులు నేర్పిన గురువును తరగతి గదిలోనే విద్యార్థి కడతేర్చిన సంఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్‌బాబు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు నగరం అన్నవరప్పాడుకు చెందిన బెజవాడ రాజేశ్‌బాబు రసాయన శాస్త్రం (Chemistry) అధ్యాపకుడు. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో దాదాపు పదేళ్ల పాటు రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు. అనంతరం స్నేహితులతో కలిసి అస్సాంలోని శివసాగర్‌ ప్రాంతంలో సొంతంగా కళాశాల నెలకొల్పారు. పదమూడేళ్లుగా రాజేశ్​బాబు ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య అపర్ణ ఆ కళాశాలల్లోనే డైరెక్టర్‌గా ఉన్నారు. కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్​ ఇయర్​ చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా రావడంతో పాటు అతడి ప్రవర్తన సైతం సరిగా లేకపోవడంతో గణిత అధ్యాపకుడు శనివారం మందలించారు. అతడు ఇంటికెళ్లి పెద్దలను తీసుకురావాలని ఆదేశించారు.

బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ.50 వేల బహుమతి

గణితం టీచర్​ విద్యార్థిని మందలించే సమయంలో ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు అక్కడే ఉన్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆయనపై కక్ష పెంచుకున్నాడు. శనివారం సాయంత్రం తన వెంట ఓ కత్తి తెచ్చుకుని తరగతి గదిలో కూర్చున్నాడు. రాజేశ్‌బాబు రసాయన శాస్త్ర పాఠాలు చెబుతుండగా, ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆ విద్యార్థి రాజేశ్​బాబు తల, ఛాతీపై పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల పనిచేసే సిబ్బంది రాజేశ్​బాబును వైద్యశాలకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సోమవారం( జులై 8న) ఒంగోలుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. దాడికి పాల్పడ్డ విద్యార్థి తండ్రి చనిపోగా తల్లి మాత్రమే ఉందని రాజేశ్​బాబ్ సోదరుడు నవీన్​ తెలిపారు. తండ్రికి నేరచరిత్ర ఉన్నట్లు తర్వాత తెలిసిందని పేర్కొన్నారు.

బెయిల్​పై తిరిగొచ్చి బాలికను హతమార్చాడు- ప్రేమోన్మాది ఘాతుకం - MINOR GIRL murder

విశాఖలో క్యాబ్​ డ్రైవర్​ దారుణ హత్య - కారణం తెలిస్తే షాక్​ - Young Man Murdered

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.