Student Died After Wall Collapsed in School in Nellore District : జగనన్న పాపం ఓ విద్యార్థి పాలిట శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో గత ప్రభుత్వం చెలగాటం ఆడింది. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని గత ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఈ క్రమంలోనే నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. నిధుల కొరత, చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, వచ్చిన నిధులు ఇతర పాఠశాలలకు మళ్లింపు తదితర కారణాలతో పూర్తి కాలేదు. జగన్ సర్కార్ వైఫల్యం కారణంగా ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పుట్టెడు శోకంలో తల్లిదండ్రులు : నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగర్లోని కేఎన్ఆర్ నగరపాలక పాఠశాలలో నాడు-నేడు పథకంలో నిర్మాణ దశలో ఆగిన అదనపు తరగతి గదుల లింటెల్, దాని మీద ఉన్న గోడ కూలి పడి విద్యార్థి మృతి చెందాడు. స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గురుమహేంద్ర అనే విద్యార్థిపై గోడ కూలీ మృత్యువాత పడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు పరుగున వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటన చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు మనస్సును కలిచివేసింది.
విచారణ జరిపించాలి : నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగానే గురుమహేంద్ర మృతి చెందడాన్ని ఏబీవీపీ నాయకులు స్కూల్ నిరసనలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలోనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ కొంది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకుల మధ్య తోపులాట జరిగింది.
నాన్నా.. హాస్టల్లో ఉండలేనంటూ తిరిగిరాని లోకాలకు - Student Died Electric Shock in Hyd
లోకేశ్ ఆర్థిక సహాయం : ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి గురుమహేంద్ర మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. భవిష్యత్ల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
కాలేజీల్లో విద్యార్ధుల సర్టిఫికెట్లు - ఇప్పించేలా కూటమి సర్కారు కసరత్తు - Student Certificates