ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు - శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు - Mahashivratri Celebrations

State Wide Mahashivratri Celebrations : రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజామున నుంచే శివాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రుద్రాభిషేకాలు, దీపార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి మహోత్సవల్లో సాంస్కృతిక వేడుకలు భక్తులందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

shivarathri_celebrations
shivarathri_celebrations
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 11:52 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు - శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు

State Wide Mahashivratri Celebrations : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తజనం పరమశివుడి సేవలో తరించారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, దీపార్చనలతో భక్తులు మెుక్కులు తీర్చుకుని రాత్రంతా జాగరణ చేశారు. స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించేందుకు విశేషంగా భక్తులు తరలివచ్చారు.

Guntur District : కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. స్మామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో కోటప్పకొండ కిక్కిరిసిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున తొలిపూజతో ప్రారంభమైన ఉత్సవాలు అర్ధరాత్రి లింగోద్భవంతో పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి త్రికూటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. భక్తులు, మహిళలు, వృద్ధులు కొండ మీద రాత్రంతా శివజాగరణ చేశారు. విద్యుత్ ప్రభల వెలుగులతో కోటప్పకొండలు కొత్త అందాలను సంతరించుకుంది.

కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు: త్రికోటేశ్వరస్వామికి బిందెతీర్ధంతో తొలిపూజ

Konaseema District : కోనసీమ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అమలాపురంలో బ్రహ్మకుమారి హార్మోన్ హౌస్ లో ఏర్పాటు చేసిన గ్లాస్ హౌస్‌ను భక్తులు దర్శించుకున్నారు. ఈ గ్లాస్‌ హౌస్‌లో ఒక్క శివలింగం 108 శివలింగాలుగా కనిపించటం ప్రత్యేకం. ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. సిద్దేశ్వరస్వామి ఆలయం వద్ద వందలాది మంది భక్తులు పరమశివుడికి దీపార్చన చేశారు. కాట్రేనికోన తీరప్రాంత గ్రామమైన మఘసానితిప్పలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు - తెల్లవారుజాము నుంచే బారులు తీరిన ప్రజలు

Eluru District : ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ అఖండ గోదావరి మధ్య కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన తిరునాళ్ల వేడుకలు అందరిని ఆకట్టుకున్నాయి. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు.

త్రేతేశ్వరస్వామి ఆలయంలో రద్దీ - సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.