ETV Bharat / state

రాష్ట్రంలో మెట్రో పరుగులు - రూ.42,362 కోట్లతో ప్రతిపాదనలు

విజయవాడ మెట్రోకు రూ.25,130 కోట్లు, విశాఖ మెట్రోకు రూ.17,232 కోట్లు - విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిధులివ్వాలన్న రాష్ట్రం

Vijayawada and Visakhapatnam Metro Rail Project
Vijayawada and Visakhapatnam Metro Rail Project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 7:26 AM IST

Vijayawada and Visakhapatnam Metro Rail Project : విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రూ. 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదించింది. విజయవాడ మెట్రోకు రూ.25,130 కోట్లు, విశాఖ మెట్రోకు 17,232 కోట్లు అవసరమని అంచనా వేసింది. విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని కోరింది. మెట్రో భూ సేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్రం భరిస్తుందని తెలిపింది.

2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రయత్నం జరిగింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు కేంద్రం ఆమోదానికి వెళ్లాయి. మెట్రోరైలు కొత్త విధానం ప్రకారం వాటిని సవరించాలని కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ సూచించింది. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెట్రోరైలు ప్రాజెక్టులను అటకెక్కించింది. విజయవాడలో భూ సేకరణ ప్రతిపాదనలనూ రద్దుచేసి, ప్రాజెక్టుకు పూర్తిగా ఉరేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు హడావుడి చేసింది. కానీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

విజయవాడ మెట్రో అమరావతికి అనుసంధానం - కేంద్రమంత్రితో నారాయణ చర్చలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మూడు నెలల్లోనే డీపీఆర్‌లు తయారు చేయించింది. 2024 ధరల ప్రకారం రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు రూ. 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదించింది. విజయవాడలో రెండు దశల్లో 3 కారిడార్లకు రూ.25,130 కోట్లు, విశాఖలో 2 దశల్లో 4 కారిడార్ల పనులకు 17,232 కోట్లు అవసరమని అంచనా వేసింది. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులను కేంద్రమే ఇవ్వాలని 2 నగరాల్లో కలిపి 258 ఎకరాల భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లను మాత్రం రాష్ట్రం భరిస్తుందని తెలిపింది.

మెట్రో రెండోదశ అంచనా వ్యయం రూ.24,269 కోట్లు - క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి అందజేత

రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నఆర్థిక పరిమితులు, నిధుల కొరత దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేసింది. కోల్‌కతాలో తూర్పు-పశ్చిమ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి 2017 మెట్రోరైలు పాలసీలో కేంద్రం 100 శాతం నిధులు సమకూర్చిన విషయాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ గత నెలలో దిల్లీలో కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ని కలిసి ప్రస్తావించారు. అదే మోడల్‌లో ఆంధ్రప్రదేశ్‌కూ నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త సిటీలోకి మెట్రో పరుగులు- రెండో దశ డీపీఆర్‌కు తుదిమెరుగులు - HYDERABAD METRO PHASE 2 DPR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.