ETV Bharat / state

దేవుడి సొమ్ముతో కాయ్ రాజా కాయ్ - క్రికెట్ బెట్టింగ్​లకు ఆలయాల నిధులు - AP ENDOWMENT DEPARTMENT SCAMS

దేవాదాయశాఖలో ఎవరికివారు ఇష్టారాజ్యం

AP Endowment Department Scams
AP Endowment Department Scams (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 7:12 AM IST

Frauds in Endowment Department : దేవాదాయశాఖలో కొందరి అధికారుల తీరు కంచె చేను మేసిన చందంగా మారింది. దేవుడి సొమ్మును కాపాడాల్సిన వారే దోచుకునేందుకు యత్నిస్తున్నారు. ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు. దేవాదాయశాఖకు చెందిన ఓ ఇంఛార్జ్ ఈఓ దేవుడి సొమ్ముతో రూ.కోటికి పైగా పెట్టి క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడేశారు.

మరో ఈఓ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కొందరిని ఆలయ ఉద్యోగులుగా నియమించి నాలుగైదు నెలలుగా జీతాలు చెల్లిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి ఆర్జేసీ కేడర్‌ అధికారి బదులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కింది కేడర్‌ అధికారికి ఈఓ బాధ్యతలు అప్పగించారు. ఇలా దేవాదాయశాఖలో కొందరు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటంతో కొందరు ఈఓలు అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఉద్యోగాలు, జీతాలు - అంతా ఆయన ఇష్టమే : కొన్ని నెలల కింద ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరుమలగిరి ఆలయ ఈఓ పలువురిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. వాస్తవానికి ఉన్నతాధికారుల అనుమతితో వారిని పొరుగుసేవల కింద గానీ, కాంట్రాక్ట్‌ పద్ధతిలోగానీ తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండా నేరుగా నియమించేసుకున్నారు. మొదట రెండు నెలల జీతాలను వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. జీతాలు నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తే వాళ్లు ఆలయ ఉద్యోగులు అవుతారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కమిషనరేట్‌కు ఫిర్యాదులు రావడంతో, సమగ్ర వివరాలివ్వాలని అధికారులు ఆదేశించారు. ఈఓ ఇవేమీ పట్టించుకోకుండా తాజాగా మరో రెండు నెలల జీతాలను కూడా దర్జాగా చెల్లించారు. ఈ వ్యవహారాన్ని గ్రామస్థులు బయటపెడితే దేవాలయంలో ఉద్యోగే దీనికి కారణమంటూ ఆయనపై ఈఓ వేధింపులు ఆరంభించారు.

అర్హత లేకపోయినా శ్రీశైలం ఈఓగా : వైఎస్సార్సీపీ సర్కార్​లో సహాయ కమిషనర్‌ (ఏసీ) కేడర్‌లో ఉంటూ కర్నూలు ఉప కమిషనర్‌ (డీసీ)గా చంద్రశేఖరరెడ్డి హవా నడిపారు. అప్పట్లో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయణ్ని శ్రీశైలం ఆలయానికి ఏఈఓగా బదిలీ చేశారు. గత నెలలో శ్రీశైలం ఈఓ పెద్దిరాజు డిప్యుటేషన్‌ పూర్తికావడంతో మాతృశాఖ (రెవెన్యూ)కు వెళ్లిపోయారు. ఆ సమయంలో డీసీ కేడర్‌లోని డిప్యూటీ ఈఓకి ఇంఛార్జ్​ ఈఓ బాధ్యతలు ఇవ్వాలి.

దేవాదాయ అధికారులు మాత్రం కింది కేడర్‌లో ఉండి, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈఓ చంద్రశేఖరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొత్త ఈఓ వచ్చేవరకు నాలుగైదు రోజుల సర్దుబాటుకే ఆయణ్ని నియమించామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రెగ్యులర్‌ ఈఓను నియమించకుండా, ఆయన్నే కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

పేషీలో పాత వాసనలు : గత సర్కార్​లో దేవాదాయ మంత్రి పేషీలో సమాచారాన్ని బయటపెడుతున్నారని ఇద్దరిని అక్కడి నుంచి పంపేశారు. ఇప్పుడు మళ్లీ వారినే పేషీలో పెట్టుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విజయవాడ వచ్చినప్పుడు ఉండేందుకు దేవాదాయ కమిషనరేట్‌లోని అతిథిగృహాన్ని వినియోగించుకునేవారు. రెండు నెలల కిందట ఆయన తాడేపల్లిలోని విల్లాలోకి మారిపోయారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఆ అతిథిగృహాన్ని తన వశం చేసుకున్నారు. పేషీ సిబ్బందిని అక్కడికే పిలిపించుకొని వ్యవహారాలు చక్కబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిధులు డ్రా చేసి - క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడేసి : గతంలో కర్నూలు జిల్లాలో దేవాదాయ ఉపకమిషనర్‌గా ఓ అధికారి పని చేశారు. ఆయన కర్నూలు జిల్లాకు చెందిన దేవాదాయ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డికి నంద్యాల జిల్లాలోని కానాల గ్రూప్‌ ఆలయాల ఈఓగా ఇంఛార్జ్​ బాధ్యతలు అప్పగించారు. ఓ ఇన్‌స్పెక్టర్‌కు ఈఓ బాధ్యతలు ఇవ్వకూడదు. అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి చేతివాటం ప్రారంభించారు. కానాల గ్రూప్‌ ఆలయాలకు చెందిన రూ.20 లక్షలను నంద్యాల యూనియన్‌ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలంటూ సహాయ కమిషనర్‌ లేఖ రాసి, చెక్‌ ఇచ్చారు. దానిని శ్రీనివాసరెడ్డి ఫోర్జరీ చేశారు. ఆ చెక్‌ను కర్నూలులోని ఎస్‌బీఐ ట్రెజరీ శాఖలో తన కుటుంబీకులు, స్నేహితుల ఖాతాల్లో జమయ్యేలా ఫోర్జరీ లేఖను సృష్టించారు. ఆ సొమ్మును పక్కదారి పట్టించి, క్రికెట్‌ బెట్టింగులకు వాడేశారు.

కర్నూలు సహాయ కమిషనర్‌ (ఏసీ) కార్యాలయంలో ఉండే చెక్‌బుక్‌ కాజేసి ఏసీ సంతకం ఫోర్జరీ చేసి మూడు దఫాలుగా మొత్తం రూ.66 లక్షలను పక్కదారి పట్టించారు. వాటినీ బెట్టింగ్‌లో పోగొట్టారు. కానాల గ్రూప్‌ ఆలయాలకు చెందిన రూ.17 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను రెన్యువల్‌ చేస్తానని చెప్పి, వాటినీ ఇతర ఖాతాల్లోకి మళ్లించి వాడేశారు. మొత్తంగా శ్రీనివాసరెడ్డి రూ.1.03 కోట్లు కాజేశారు. ఇందులో బ్యాంక్‌ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఇటీవల ఈ వ్యవహారం బయటకు రావడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఆయణ్ని సస్పెండ్‌ చేసి, చేతులు దులిపేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, క్రిమినల్‌ కేసు నమోదు చేయించాల్సి ఉన్నా అవేమి పట్టించుకోలేదు.

బయటపడుతున్న శాంతి లీలలు - నిబంధనలకు విరుద్ధంగా లీజుల పొడిగింపు - Shanti Irregularities in Endowment

స్వామి.. నీ ఆస్తులకు దిక్కెవరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.