ETV Bharat / state

తండ్రిని నరికి చంపిన కొడుకు - ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్​ - SON KILLED FATHER

కోడలు ప్రవర్తన సరిగా లేదని మందలించిన మామ - తండ్రిని కిరాతకంగా హతమార్చిన కొడుకు

son_killed_his_father_and_tried_to_frame_it_as_accident_in_anantapur_district
son_killed_his_father_and_tried_to_frame_it_as_accident_in_anantapur_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 2:27 PM IST

Son Killed His Father and Tried to Frame it As Accident In Anantapur District : తన భార్యను మందలించాడని ఓ కొడుకు కన్న తండ్రినే అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయదుర్గం పట్టణంలోని సిద్ధేశ్వర కాలనీకి చెందిన బొమ్మన్న(51)ను కన్న కుమారుడు దారుణంగా హత్య చేశాడు. తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు బొమ్మన్న, శివమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాలతో తండ్రి, కుమారుడు నాగరాజు తరచూ గొడవ పడేవారు. కోడలు ఆశా ప్రవర్తన సరిగా లేదని ఆయన మందలించారు. దాంతో శనివారం ఉదయం తండ్రి, కుమారుడు ఇద్దరూ ఇంట్లో ఘర్షణ పడ్డారు.

ఏడాదిన్నర క్రితం హత్య- మందు బాటిల్​ సాక్ష్యం- రెండు కేసుల్లో నిందితుడు ఒకరే

ఆ తర్వాత బొమ్మన్న సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రం పెదారగుడ్డం గ్రామంలోని వ్యవసాయ తోటకు వెళ్లారు. సాయంత్రం ద్విచక్ర వాహనంలో తన బంధువు సురేష్‌తో కలిసి వస్తుండగా, మల్లాపురం తండా సమీపంలోని మెచ్చిరి రోడ్డులో కుమారుడు నాగరాజు తన స్నేహితుడు పబ్జీతో కలిసి స్కూటీలో ఎదురుపడ్డారు. అక్కడ ఇద్దరూ గొడవ పడ్డారు. కుమారుడు వెంట తెచ్చుకున్న కొడవలితో తండ్రిని నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాడు.

వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అందరికీ తన తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు చెప్పాడు . అయితే నాగరాజు బళ్లారిలో ఉన్న తన చెల్లి శైలజకు వాట్సాప్‌ కాల్‌ చేసి తండ్రిని చంపుతానని చెప్పాడని, ఆమె వద్దని వారించినా వినకుండా ఈ దురాగతానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పోలీసులు నాగరాజుతో పాటు అతని స్నేహితుడు పబ్జీని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించాడు. తల్లి ఫిర్యాదు మేరకు సీఐ జయనాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్​లో వృద్ధ దంపతుల దారుణహత్య - నగల కోసమేనా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.