ETV Bharat / state

విధి ఆడిన వింత నాటకం - ఒకే ఆసుపత్రిలో అటు తండ్రి మరణం - ఇటు పుత్రుడి జననం - BABY BORN JUST AFTER FATHER DIES

తండ్రి మృతి చెందిన గంటకు పుత్రుడి జననం

Baby Born Just After Father Dies
Baby Born Just After Father Dies (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2024, 7:10 AM IST

Updated : Oct 24, 2024, 7:52 AM IST

Baby Born Just After Father Dies : పుట్టబోయే బిడ్డ కోసం ఆ దంపతులు కోటి ఆశలతో ఎదురుచూశారు. ఆ శిశువు నాన్న అని పిలిచే పదం కోసం ఆ తండ్రి పరితపించాడు. ఆ బిడ్డను ఎత్తుకొని ఆడించాలని కలలు కన్నాడు. కానీ వారి పట్ల విధి వింత నాటకం ఆడింది. ఆ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన ఒక గంట వ్యవధిలోనే అతడి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓవైపు తండ్రి మరణం మరోవైపు కుమారుడి జననం. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రం రాజోలిలో శివ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతడు పెట్రోలుబంకులో పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానిపల్లెకు చెందిన లక్ష్మితో అతడికి 14 నెలల కిందట వివాహమైంది. ఆమె గర్భం ధరించడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. శివ మంగళవారం సాయంత్రం రాజోలిలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎస్సీ కాలనీ వద్ద అదుపు తప్పి పడిపోయాడు.

ఈ క్రమంలో శివ తలకు తీవ్ర గాయాలు కావడంతో రాత్రి 8 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఈ విషయాన్ని బనగానిపల్లెలో ఉన్న లక్ష్మికి తెలిపినా ప్రాణాపాయం లేదని ధైర్యం చెప్పారు. సరిగ్గా మంగళవారం రాత్రే లక్ష్మికి పురిటినొప్పులు రాగా ఆమెను రాత్రి 10 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్చారు. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో శివ మరణించాడు.

లక్ష్మి ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండడంతో ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేదు. అనంతరం వైద్యులు ఆమెకు సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేయగా మగశిశువు జన్మించాడు. తండ్రి మరణించిన సుమారు గంట తర్వాత ఆ పసివాడు కళ్లు తెరిచాడు. పండంటి బిడ్డ పుట్టిన ఆనందాన్ని అనుభవించకుండానే శివ మృతి రూపంలో ఆ కుటుంబాన్ని విషాదం కమ్మేసింది. ఇటు తండ్రి మృతి, కుమారుడి జననంతో స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

రెండేళ్ల చిన్నారి మృతికి కారణమైన దంపతుల మధ్య గొడవ

విషాదాన్ని నింపిన పదేళ్ల చిన్నారి మరణం - తండ్రి ఆటో నడుపుతుండగా జారిపడి

Last Updated : Oct 24, 2024, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.