ETV Bharat / state

మంగళగిరిలో "నైపుణ్య గణన" ప్రాజెక్టు ప్రారంభం - 25 అంశాల్లో సమాచార సేకరణ - Skill Enumeration Project Started - SKILL ENUMERATION PROJECT STARTED

Computation of Skill in Practice Today : కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను మంత్రి లోకేశ్​మంగళగిరిలో ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిదిద్దుకుంటూ నేడు పలు ప్రాంతాల్లో విజయవంతంగా ''నైపుణ్య గణన'' జోరుగా సాగింది.

skill_enumeration_project_started_in_mangalagiri
skill_enumeration_project_started_in_mangalagiri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 4:36 PM IST

"Skill Enumeration" Project Started in Mangalagiri : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న "నైపుణ్య గణన" ప్రాజెక్టును మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, మంగళగిరి నగర పాలక సంస్థ అధికారులు నైపుణ్య గణన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి అర్బన్ మండలం, తాడేపల్లి, దుగ్గిరాల, రాజధాని ప్రాంతంలోని 16 గ్రామాలను 5 క్లస్టర్లుగా విభజించారు. మొత్తం లక్షా 61వేల 421కుటుంబాల సమాచారాన్ని సేకరిస్తున్నారు.

రోజుకు 8 కుటుంబాల సమాచారాన్ని సేకరించనున్నారు. 30 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఐదు క్లస్టర్లలో 673 సిబ్బందిని నియమించారు. ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు 25 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్​ను తయారు చేశారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు.

ఈ నైపుణ్య గణన కోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఆరుగురు చొప్పున ఉద్యోగులు పని చేయనున్నారు. వీరు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి, ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేస్తారు. అక్షరాస్యులా? కాదా? ఉద్యోగులా? చదువు పూర్తయినా ఉద్యోగం రానివారా? ఉద్యోగం సంఘటిత రంగమా? అసంఘటిత రంగమా? నిరుద్యోగుల విద్యార్హతలు? ఇలా 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు.

నైపుణ్యాలే ఉపాధికి ఊతం - ఎలక్ట్రికల్ నుంచి సాఫ్ట్ వేర్ కోర్సుల వరకు శిక్షణ ఆ భవనంలోనే!! - digital Training Unemployed Youth

సర్వే పూర్తయ్యాక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? నిరక్షరాస్యులు ఎంతమంది? తదితర వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సమాచారం దాదాపు 20 ఏళ్లపాటు నైపుణ్య, ఉపాధి కల్పనకు ఉపయోగపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా వివరాలతో ఎవరికి ఎలాంటి నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తించి, అయా అంశాల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. శిక్షణ తర్వాత అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇస్తారు. ఎలాంటి నైపుణ్యాలు అవసరమో కంపెనీల నుంచి వివరాలు సేకరించి తదనుగుణంగా శిక్షణ ఇచ్చి, వారిని ఆయా సంస్థలకు అనుసంధానం చేస్తారు.

'15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల వయస్సున్న వారి స్కిల్స్​, విద్యార్హతలు తెలుసుకుంటున్నాం. వారి నైపుణ్యలను బట్టి ఎనిమిది సెక్టార్లలో వివరాలు సేకరిస్తున్నాం. దీంతో వారికి ఏ రంగంలో ఉపాధి కల్పించాలన్నది సులభమవుతుంది.​' -అనిల్ కుమార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈడీ

ఏపీలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు - 2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు - Lokesh Review On Education

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.