Minister Seethakka in Alluri Sitaramaraj Jayanthotsavam in Hyderabad : అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై రెబల్ స్టార్ ప్రభాస్‌తో చిత్రం చేయించేందుకు ప్రయత్నం చేస్తానని త్వరలో ఆయన్ను అల్లూరిలా చూడబోతారని కృష్ణంరాజు సతీమణీ శ్యామల దేవీ అన్నారు. అల్లూరి సీతారామ రాజు 127వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణీ శ్యామల దేవి అల్లూరి క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే సీతారామ రాజు మళ్లీ పుట్టినట్లు ఉంటుందని అన్నారు.
"15ఏళ్ల క్రితం అల్లూరి విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని కృష్ణంరాజు కోరారు. అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్లో అందరూ ప్రభాస్‌ను చూడాలని అనుకుంటున్నారు. వారందరి కోరిక నేను బాబుకు వినిపిస్తాను. ఆ పాత్ర గురించి ఎలాంటి అవకాశమున్న చేయమని చెబుతాను. మళ్లీ ఆయన్ను ఆ పాత్రలో కనిపిస్తారని అందరూ అంటున్నారు ఇవన్నీ నేను ప్రభాస్‌తో చెప్తాను." - శ్యామల దేవీ, కృష్ణంరాజు సతీమణి
Alluri Jayanti celebrations At Hyderabad : 'అల్లూరి జీవనగాథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం'
గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు అల్లూరి సీతారామరాజు అని మంత్రి సీతక్క అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు, బ్రిటీష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ నీరుడు అని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విజ్ఞప్తి చేశారు.
"200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామ రాజు అంటేనే పోరాటం, వెలుగు, స్ఫూర్తి. అడవుల్లో జీవించే వారి కోసం, ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్ వారితో పోరాడి హక్కులను కాపాడిన వ్యక్తి. అలా ప్రజల శ్రేయస్సు కోసం పోరాటి అందులోనే ప్రాణం కోల్పోయిన వ్యక్తి అల్లూరి. ఆయన పోరాటాలు గుర్తుపెట్టుకుని భవిష్యత్ తరాలకు అందిస్తాము. పార్లమెంట్లో అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం." - సీతక్క, మంత్రి
'స్పిరిట్'లో ప్రభాస్ లుక్ ఇదే - డార్లింగ్‌కు సందీప్ వంగా సూచనలు! - Prabhas Spirit Movie
విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తప్పవు : మంత్రి సీతక్క - MINISTER SEETHAKKA REVIEW