ETV Bharat / state

వైఎస్సార్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - ఎనిమిది మంది మృతి - Road Accidents at YSR District - ROAD ACCIDENTS AT YSR DISTRICT

Several People Dead in Road Accident at YSR District: వైఎస్సార్​ జిల్లా గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింత కొమ్మదిన్నె పరిధిలో కారు కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు.

Four People Dead  in Car Accident
Four People Dead in Car Accident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 8:31 PM IST

Updated : Aug 26, 2024, 10:53 PM IST

Several People Dead in Road Accident at YSR District : వైఎస్సార్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారును కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్, క్లినర్​ అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ఉన్నవారు చక్రాయపేట మండలానికి చెందిన వారి బంధువు సత్యనారాయణ పది రోజులు క్రిందట మృతి చెందాడు. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తొలుత కారులో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు డ్రైవర్ దువ్వూరుకు వెళ్లారు. అక్కడి నుంచి గువ్వలచెరువు వస్తుండగా ఘాట్ రోడ్డులోని ఆరవ మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటైనర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురుతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లారీ లోయలో పడిపోవడంతో క్యాబిన్​లో ఇద్దరు ఇరుక్కుపోయారు.

విషయం తెలుసుకున్న మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుల స్వస్థలం చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. కంటైనర్‌ డ్రైవర్‌ వివరాలు తెలియాల్సి ఉంది. కారును అతి కష్టం మీద బయటకు తీసి మృతదేహాలను శవపరీక్షకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు - ఐదుగురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు - Accidents in Palnadu District

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి: దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో భగత్ సింగ్, నాగలక్ష్మి అనే మహిళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పుట్టు వెంట్రుకల కోసం కర్నూలు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాల్లో 20 మంది కుటుంబ సభ్యులు బయలుదేరగా తవేరా వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరవాడ సినర్జిన్ ప్రమాద ఘటన - మూడుకు చేరిన మృతుల సంఖ్య - Parawada Pharma City Accident

రహదారి ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ఫోకస్​ - భద్రతా చర్యలకు ఆదేశం - Road Accidents Raised In AP

Last Updated : Aug 26, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.