ETV Bharat / state

రాష్ట్రంలో ఎడతెరపిలేని వర్షాలు - ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు - SCHOOL HOLIDAYS DUE TO RAINS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 10:09 PM IST

School Holidays Declared in Some Districts Due to Heavy Rains : రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కోనసీమ జిల్లాలో గోదావరి నది ఉద్ధృతి దృష్ట్యా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం, చింతూరు డివిజన్‌లలో భారీ వర్షాల కారణంగా రెండ్రోజులపాటు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

schools holiday on monday
schools holiday on monday (ETV Bharat)

School Holidays Declared in Some Districts Due to Heavy Rains : ఏపీలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గోదావరి నది ఉద్ధృతి దృష్ట్యా సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ వెల్లడించారు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, చింతూరు డివిజన్‌లలో భారీ వర్షాల కారణంగా రెండ్రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం 10 అడుగులు దాటింది. దీంతో ధవళేశ్వరం నుంచి 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. మరోవైపు డెల్టా కాలువలకూ నీటిని విడుదల చేశారు.అలాగే భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ప.గో. జిల్లాలో రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అదేవిధంగా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

భారీ వర్షాలతో కోస్తా, ఉత్తరాంధ్ర అతలాకుతలం- కట్టలు తెగిన వాగులు, నిండుకుండల్లా జలాశయాలు - Heavy Rains in AP

కోనసీమ జిల్లాలో కర్షకులకు కంటిమీద కునుకు లేదు : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కర్షకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కాలువలు పోటెత్తి పొలాలపైకి విరుచుకుపడ్డంతో ఎక్కడా వరి దాఖలాలు కనిపించడంలేదు. ప్రతీ మడి చెరువు మాదిరి కనిపిస్తోంది. మరోవైపు ఉద్యానపంటలూ దెబ్బతిన్నాయి. లంక గ్రామాల ప్రజలకు మరపడవలే ఆధారమయ్యాయి. తూర్పులోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, చాగల్లులోని పొలాలు, అనేక ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 187 గ్రామాల్లో వర్షాల ప్రభావం ఉంది. 1.87 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగు చేపట్టగా ఇప్పటివరకు 87,712 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. వీటిలో ఎక్కువ శాతం రామచంద్రపురం, కొత్తపేట డివిజన్‌లోనే వేశారు. ఈ జిల్లా వ్యాప్తంగా 7929 ఎకరాల్లో వరినాట్లు ముంపు బారిన పడ్డాయి. అత్యధికంగా రాయవరం మండలంలో 1204, కపిలేశ్వరపురం 1160, అయినవిల్లి, 997, అంబాజీపేట 850, పి.గన్నవరం 826 ఎకరాల్లో వరద ఉంది. 421 ఎకరాల్లోని నారుమళ్లు నీటమునిగాయి.

అల్లూరి జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు : అల్లూరి జిల్లా జిల్లా మన్యంలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం మండలం భూపతి పాలెం, ముసురుమీల్లి, సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. రంపచోడవరం మండలం బందపల్లి నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిజన గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవటంతో రంపచోడవరం ఐటీడీఏ అధికారులు వరద సహాయక చర్యలు చేపట్టారు.

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో వందల ఎకరాల వరి పంట నీటమునిగింది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడు మండలాల్లో పంటలు పెద్దఎత్తున నీటిపాలయ్యాయి. ఆరుగాలం శ్రమించి, సాగుచేసిన పంట కళ్లముందే నాశనమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలతో సరికొత్త శోభ - ఆకటుకుంటున్న ఎత్తిపోతల జలపాతం - Tourists in Ethipothala water Falls

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.