ETV Bharat / state

అలా ఎలా వదిలేశారు ? - సంధ్య ఆక్వా బస్సు విషయంలో అనేక అనుమానాలు - Sandhya Aqua Bus Incident - SANDHYA AQUA BUS INCIDENT

Sandhya Aqua Bus Incident: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా అధికారులు తనిఖీలు చేశారు. బస్సులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు గుర్తించారు. తనిఖీల తర్వాత బస్సులో ఉన్న కీలక దస్త్రాలను సీబీఐకి అప్పగించకుండా, పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sandhya_Aqua_Bus_Incident
Sandhya_Aqua_Bus_Incident
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 7:39 AM IST

అలా ఎలా వదిలేశారు? - సంధ్య ఆక్వా బస్సు విషయంలో అనేక అనుమానాలు

Sandhya Aqua Bus Incident : కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమకు చెందిన బస్సును నిలిపి ఉంచడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు చేసిన అధికారులు అందులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్కులను గుర్తించారు. తర్వాత బస్సును పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటెయినర్‌లో భారీగా డ్రగ్స్‌ నిల్వలు ఉండటాన్ని గుర్తించిన సీబీఐ అధికారులు అది సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్థరించారు. తర్వాత రెండురోజుల పాటు మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు పరిశ్రమలో సీబీఐ బృందం విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు 3 రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండటం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు.

ఒక్కో అట్టపెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్కులు ఉన్నట్లు గుర్తించారు. ఎస్సై స్వామినాయుడు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో 3 రోజులుగా అక్కడే పార్కింగ్‌ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్సై చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సుతో పాటు అందులోని రికార్డులను అప్పగించినట్లు వివరించారు.

సరకు పాడవుతుందనా - ఏమైనా చేస్తారనా ? - కంటైనర్​ భద్రతపై సీబీఐ దృష్టి - VIZAG PORT DRUGS CONTAINER SAFETY

రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏంటి?: పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్‌బుక్కులు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ రికార్డులు సంధ్య ఆక్వా పరిశ్రమ నుంచి బయటికొచ్చినట్లు సమాచారం. మరోవైపు సోదాలు జరిగితే రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్‌ కంటెయినర్‌ను సీబీఐ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, మూలపేటలో ఉన్న పరిశ్రమలో తనిఖీలకు రెండు రోజుల ముందు యాజమాన్యం రహస్య మీటింగ్ నిర్వహించుకున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

ప్రశ్నలుగానే మిగిలిపోయాయి: సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సును పోలీసులు విడిచిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బస్సుతో సహా రికార్డులను ఆ అధికారులకు అప్పగించాల్సింది పోయి, పరిశ్రమ ప్రతినిధులకు అందజేశామని పోలీసులు పలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బస్సులో డ్రగ్స్‌ లేవని పరిశీలించి పోలీసులు ఎలా వదిలేశారన్నది ప్రశ్నార్థకం. 3 రోజులుగా పరిశ్రమకు సంబంధం లేని మారుమూల ప్రాంతంలో బస్సును ఎందుకు నిలిపి ఉంచారు. వాహనం మరమ్మతులకు గురైందని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నా సరిచేయడానికి 72 గంటల సమయం ఎందుకు పట్టింది అన్నవి ప్రశ్నలుగానే మిగిలాయి.

విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో కూనం కోటయ్య కుటుంబం - వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు - Vizag Drugs Case YSRCP Relation

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.