ETV Bharat / state

ఆర్టీసీ రథ చక్రాలకు కళ్లెం వేసిన జగన్ సర్కార్ - వేగంగా ప్రైవేటు పరం! - Jagan destroyed RTC - JAGAN DESTROYED RTC

RTC Destroyed By YCP Government : ప్రజా రవాణా సంస్థ ప్రగతి రథ చక్రాలకు జగన్‌మోహన్‌ రెడ్డి కళ్లెం వేశారు. ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని ఎంత నిర్వీర్యం చేయాలో అంతా చేశారు. ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర్నుంచి కొత్త బస్సులు, ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు ఇలా సమస్య అనేదే లేకుండా చేస్తానని ప్రతిపక్షంలో ఉండగా జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి నేనేంటో నిరూపిస్తా అని చెప్పారు. కానీ, పూర్తిగా నట్టేట ముంచారు. మరి ఆ చిట్టా ఏంటో మీరూ చూడండి.

rtc
rtc
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 10:51 PM IST

Updated : Apr 3, 2024, 10:59 PM IST

RTC Destroyed By YCP Government : జగన్​ సర్కార్ ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని ఎంత నిర్వీర్యం చేయాలో అంతా చేశారు. విలీనం పేరిట ఆర్టీసీ బస్సుల కొనుగోలు ఆపేశారు. ప్రైవేటు పరంను వేగవంతం చేశారు. వైసీపీ నేతలకు ఆర్టీసీకి చెందిన వేల కోట్ల ఆస్తులు లీజుకు అప్పగించారు. కొత్త బస్సుల కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు డొక్కు బస్సులే గతయ్యాయి. ఆ బస్సుల చక్రాలు ఊడటం, ప్రమాదాల బారిన పడుతుండటం ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోడం ఇలా ఈ ఐదేళ్లలో ఆర్డీసీకి ఎంత చేయాలో అంతా చేశారు.

ఆర్టీసీ ఆస్సులు ప్రైవేటు పరం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక APSRTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆంజనేయ రెడ్డి కమిటీతో అధ్యయనం జరిపించి ఆ నివేదిక ఆధారంగా RTCని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనాన్ని ఓ అద్భుతంగా ఆనాడు అధికార పార్టీ నేతలు తెగ అభివర్ణించారు. రవాణా రంగం రూపు రేఖలే మారతాయన్నారు. ప్రజలకు భారీగా కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. సీన్‌ కట్‌ చేస్తే చెప్పింది ఒకటి జరుగుతోంది మరొకటి అన్నట్టు ఉంది. విలీనం అనంతరం ప్రైవేటీకరణ వేగవంతమయ్యింది. విలీనం నాటికి RTC అప్పు కేవలం 6 వేల 700 కోట్లు. కానీ, ఆర్టీసీకి ఉన్న ఆస్తుల విలువ 50 వేల కోట్ల పై మాటే. అయితే, ఇక్కడే వైసీపీ ప్రభుత్వం ఆసలైన ఆట మెుదలుపెట్టింది. డీజిల్ రేట్లకు అనుగుణంగా టికెట్ రేట్లుపెంచకపోవడం, MV టాక్స్‌లు, స్పేర్ పార్ట్స్ ధరల పెంపు తదితర కారణాలతో వచ్చిన నష్టాలను బూచిగా చూపి ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు రెడ్ కార్పెట్ పరిచింది.

ఆర్టీసీలో కాంట్రాక్టులన్ని వైసీపీ నేతల చేతుల్లో : విలీనం అనంతరం సిటీ సెంటర్లలో ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తున్నారు. ఆర్టీసీ సొంతంగా అభివృద్ధి చేసి అద్దెకిచ్చే అవకాశం ఉన్నా వైసీపీ సర్కారు ఆ పని చేయలేదు. ఇప్పటికే ఈ తరహాలో నాలుగు డీజిల్ బంకులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లలోని ముఖ్యమైన స్థలాలు, హోటళ్లు, డార్మెటరీలు అన్నీ వైసీపీనేతల పరమయ్యాయి. పలు జిల్లాల్లోఖాళీ స్థలాలన్నీ వైసీపీనేతలు లీజు పద్ధతి ద్వారా తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నారు. పలు చోట్ల వైసీపీ కేంద్ర కార్యాలయాల నిర్మాణాలకు సైతం కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను తీసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీలో అద్దెబస్సులు పెట్టే కాంట్రాక్టులు సైతం వైసీపీ నేతల చేతుల్లోనే నడుస్తోంది.

ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య : విలీనం అనంతరం ప్రజల కోసం ఆర్టీసీ బస్సులు ఏమైనా పెరిగాయా అంటే అదీ లేదు. ఉన్న బస్సులను తగ్గించేసి ప్రయాణికులకు నరక యాతన పడేలా చేశారు. 2019లో వైసీపీ సర్కారుకు అధికారంలోకి వచ్చి స్టీరింగ్ చేపట్టింది మొదలు ఆర్టీసీ పతనం ప్రారంభమైంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2019 మార్చి నాటికి సంస్థలో 12027 బస్సులు తిరుగుతుండగా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏకంగా 1324 బస్సులను తగ్గించింది. దీంతో ప్రస్తుతం తిరుగుతోన్న బస్సుల సంఖ్య 10703కి పడిపోయింది. 2019లో సంస్థ సొంత బస్సులు 9459 ఉండగా ఐదేళ్లలో 520 బస్సులను తగ్గించగా ప్రస్తుతం అవి 8106కి పడిపోయింది. 2019 లో అద్దె బస్సులు 2568 ఉండగా ఐదేళ్లలో వారికి రెడ్ కార్పేట్ వేశారు. దీంతో ఐదేళ్లలో అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో తిరిగే ఆర్టీసీ సొంత బస్సులు 79 శాతం కాగా అద్దె బస్సుల శాతం 21 శాతం మాత్రమే. దీన్ని బట్టి చూస్తే సంస్థను ప్రభుత్వం ప్రైవేటీకరణవైపు ఎలా నడిపించిందో అర్థమవుతుంది. 2022 బడ్జెట్ లో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం 408 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టినా ఒక్క బస్సునూ కొనలేదు. ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న 8895 బస్సుల్లో 2400 బస్సులు కాలం చెల్లినవే ఉన్నాయి. వీటి స్థానంలో కొత్త బస్సులు రావాల్సి ఉండగా కొనుగోలు చేయలేదు.

ప్రయాణికులపై ఏటా 1200 కోట్ల రూపాయల భారం : విలీనం చేసి సదుపాయాలు పెంచుతామన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మూడు సార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డి విరిచారు. దీంతో ప్రయాణ చార్జీలు మూడింతలు అయ్యాయి. గతంలో టికెట్ లెక్కన సెస్ వసూలు చేస్తుండగా ఇప్పుడు ప్రయాణించిన దూరానికి కిలోమీటర్ల ప్రకారం లెక్క చూసి సెస్‌ను బాదేశారు. దీంతో ఏటా 1200 కోట్ల రూపాయల భారాన్ని ప్రయాణికులపై మోపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచిన ప్రభుత్వం కనీసం సదుపాయాలైనా కల్పించిందా అంటే అదీ లేదు. రోడ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో అధ్వాన్నంగా తయారయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతోన్న 2400 డొక్కు బస్సులు ఎప్పుడు , ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నాయి. కొన్నిచోట్ల బస్సు టైర్లు ఊడి ప్రమాదాలు జరిగిన ఘటనలను మనం చూస్తున్నాం. అటు కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వకపోవడంతో ఆర్టీసీ ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 3669 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బస్సుల సంఖ్య తగ్గించి పలు గ్రామాలకు బస్సులను నిలిపి వేసింది. ఫలితంగా ఇప్పుడు ఆర్టీసీబస్సులు తిరగని గ్రామాల సంఖ్య 5 వేలకు పెరిగింది.

" ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన వైసీపీ ప్రభుత్వం దశాబ్దాలుగా వస్తోన్న అనేక ఆర్థిక ప్రయోజనాలను తీసేసింది. విలీనం అనంతరం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా తగ్గింది. ఆర్టీసీలోని 51 వేల మంది ఉద్యోగులు 2020, జనవరి ఒకటి నుంచి పీటీడీ ఉద్యోగులుగా మారారు. ఇప్పటికి వీరికి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా పూర్తిస్థాయిలో అన్ని ప్రయోజనాలు దక్కడంలేదు. ప్రతి అంశంపై ప్రభుత్వం ఏదో విధంగా కొర్రీలు వేసి, ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. వైసీపీ సర్కారు తీరుతో గతంలో ఆర్టీసీలో ఉండే అనేక ప్రయోజనాలు ఆగిపోగా, ఇప్పుడు ప్రభుత్వం తరపున దక్కాల్సినవన్నీ అందటంలేదు. ఆర్టీసీ ఉద్యోగులు విలీనానికి ఒప్పుకునేందుకు ప్రధాన కారణం పాత పింఛన్ విధానం అమల్లోకి తెస్తామని హామీతోనే. రిటైర్‌ అయిన ఉద్యోగులకు గరిష్ఠంగా 3 నుంచి 5వేల పింఛన్ మాత్రమే ప్రస్తుతం వస్తుంది. దీంతో వారి కుటుంబాలు అష్ట కష్టాలు పడుతోన్నాయి. పాత పింఛన్ విధానం వస్తే తమ కష్టాలు తీరతాయని భావించిన ఉద్యోగుల కుటుంబాలను జగన్ నిలువునా మంచారు." - వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఉద్యోగి

"ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRC బకాయిలనూ జగన్ సర్కారు పక్కన పెట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చినపుడు నెట్‌ జీతం మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. జీతాల నుంచి మినహాయించిన కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ-CCS రుణ రికవరీ, పీఎఫ్‌ వాటా, తదితరాల గ్రాస్‌ మొత్తాన్ని విడుదల చేయలేదు. ఇలా ఇవ్వాల్సిన మొత్తం 100 కోట్ల వరకు ఉంటుంది. క్యాడర్ ఫిక్సేషన్ పేరిట బదిలీలు చేసి ఉద్యోగులకు వచ్చే DA మొత్తాన్ని కోసేశారు. విలీనానికి ముందు ఆర్టీసీలో అనేక మంది జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపర్ వైజర్లను ప్రమోషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిష్పత్తిలో భాగంగా 30 శాతం వరకు పదోన్నతులు ఇచ్చారు. విలీనం అనంతరం ఖాళీలు లేవని పదోన్నతులు ఇవ్వలేదు. వన్ టైమ్ మేజర్ కింద 30 రెగ్యులేషన్లో ఉన్న వారందరినీ రెగ్యులర్ చేయాలని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు. గతంలో పదో తరగతి చదివిన డ్రైవర్‌కు సీనియారిటీ ప్రకారం ఏడీసీ పదోన్నతి ఇచ్చేవారు. విలీనం అనంతరం డిగ్రీ ఉంటేనే పదోన్నతి ఇస్తామని మెలిక పెట్టి వేలాది మంది పొట్ట కొట్టారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు సీఎం జగన్ సహా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడు." - యార్లగడ్డ రమేష్, ఆర్టీసీ ఉద్యోగి

"ఆర్టీసీ ఉద్యోగులు పింఛన్ కోసం సర్వీసులో ఉండగానే నెల నెలా కొంత మొత్తాన్ని వేతనాల్లోంచి పొదుపు చేసుకునేవారు. దీనికోసం 1989 నుంచి సిబ్బంది పదవీవిరమణ ప్రయోజనం పథకం-SRBS అమలు చేసేవారు. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత రికవరీ చేసి, దానికి యాజమాన్య వాటా జతచేసేవారు. పదవీ విరమణ తర్వాత నెలకు 3200 వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు. ఉద్యోగి మరణిస్తే, జీవిత భాగస్వామికి సగం మొత్తం అందించేవారు. కానీ, విలీనం తర్వాత సర్వీసులో ఉన్నవారికి ఈ పథకం వర్తించదని నిలిపేశారు. అటు ఉద్యోగుల నుంచి గతంలో రికవరీ చేసిన మొత్తాన్ని అందరికీ ఇవ్వలేదు." - సుందరయ్య, ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎస్ అధ్యక్షుడు

ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఏమాత్రం తక్కువ కాదు. కానీ, వారికీ అందరిలా దక్కాల్సిన ప్రయోజనాలు దక్కడం లేదు. 5ఏళ్లు అధికారంలో ఉన్నా చేస్తాడన్న గ్యారెంటీ లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. పోనీ మాలిక సదుపాయాలు ఏమైనా మెరుగుపరిచాడ అంటే అది లేదు. మళ్లీ అదే తంతును పునారవృతం చేస్తే తాము తట్టుకోలేమని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. తమ హక్కులను నేరవేర్చే ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటామని అంటున్నారు.

Last Updated : Apr 3, 2024, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.