ETV Bharat / state

'బెదిరింపులు భరించలేకున్నాం, కౌంటింగ్ వరకూ డ్యూటీ చేయలేం' - ఈసీని సెలవు కోరుతున్న ఆర్వోలు - ROs Requesting EC for Leaves

ROs Requesting EC for Leaves Due to Pressure: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక రిటర్నింగ్ అధికారులు ఈసీని సెలవులు కోరుతున్నారు. కౌంటింగ్ వరకూ విధులు నిర్వహించే పరిస్థితి లేదంటూ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి ఆర్వోలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారి అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని వాపోతున్నారు.

ros_requesting_ec_leaves
ros_requesting_ec_leaves (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 4:05 PM IST

ROs Requesting EC for Leaves Due to Pressure: అధికార పార్టీ అభ్యర్ధుల ఒత్తిళ్లు తట్టుకోలేక రిటర్నింగ్ అధికారులు ఈసీని సెలవులు కోరుతున్నారు. కొన్ని జిల్లాల నుంచి రిటర్నింగ్ అధికారులు ఈసీకి విజ్ఞప్తులు (Returning Officers Appeals to EC) పంపుతున్నారు. పోలింగ్ సమయం నుంచే ఈసీకి విజ్ఞప్తులు చేస్తున్న ఆర్వోలు, అధికార పార్టీకి చెందిన అభ్యర్ధుల అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్ధుల ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నామని ఆర్వోలు ఈసీకి నివేదిస్తున్నారు.

ఈవీఎం విధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్​ ! - EC SERIOUS ON PINNELLI RAMAKRISHNA

కౌంటింగ్ వరకూ విధులు నిర్వహించే పరిస్థితి లేదంటూ విజ్ఞప్తుల్లో రిటర్నింగ్ అధికారులు ఈసీని (Election Commission) అభ్యర్ధిస్తున్నారు. ఆర్వో బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఈసీని వేడుకుంటున్నారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి ఆర్వోలపై అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు పెరిగాయని వాపోతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపులతో రిటర్నింగ్ అధికారులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. కేవలం ఐఏఎస్​ అధికారులు మాత్రమే సదరు అభ్యర్ధులతో మాట్లాడగలరని ఈసీకి నివేదిస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో తమను ఆర్వో బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఈసీని వేడుకుంటున్నారు.

ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- అక్కడ 144 సెక్షన్​ అమలు - POLICE MOCK DRILL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.