ETV Bharat / state

మల్లన్న దారిలో మనసు దోచే భారీ నిర్మాణం - ప్రకృతి ఒడిలో 'పైదారి'లో ప్రయాణం

హైదరాబాద్‌ - శ్రీశైలం హైవేలో రోడ్డు విస్తరణ ప్రాజెక్టు - వన్యప్రాణుల సంరక్షణ కోసం 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్‌ కారిడార్‌

Elevated Corridors in Hyderabad to Srisailam National Highway
Elevated Corridors in Hyderabad to Srisailam National Highway (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 12:43 PM IST

Elevated Corridors in Hyderabad to Srisailam National Highway : నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు 147.31 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌రిజర్వు మీదుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు రాష్ట్ర అటవీశాఖతో ఇటీవల సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రాజెక్టు గురించి వివరించారు. అరణ్యభవన్‌లో జరిగిన సమావేశంలో అటవీశాఖ నుంచి పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) ఎలూసింగ్‌ మేరు హాజరయ్యారు.

30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్‌ కారిడార్‌ : హైవే-756లో హైదరాబాద్‌-శ్రీశైలం సెక్షన్‌ మధ్య ప్రస్తుత ట్రాఫిక్, రానున్నకాలంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వరుసల నుంచి 4 లేన్లుగా విస్తరించే ప్రణాళికను వివరించారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తామని మిగతాచోట భూభాగంలోనే రోడ్డును విస్తరిస్తామని తెలిపారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో 128.6 కి.మీ. నుంచి 191 కి.మీ. వరకు రోడ్డువిస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు. మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ వరకు తెలంగాణ పరిధిలో జాతీయ రహదారిని విస్తరిస్తారు.

రణస్థలంలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ - రూ.252 కోట్లుతో కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తుంది. తెలంగాణలో 62.5 కి.మీ. మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక కాగా, ఇందులో 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అటవీశాఖకు వివరించారు. రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూమి విషయమై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేశారు. నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో అటవీ భూమి కావాలని అధికారులు అటవీశాఖకు తెలిపారు.

ఆ సమయంలో రాకపోకలు బంద్ : కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల ప్రజంటేషన్‌ విన్న అటవీ అధికారులు పలు షరతులు పెట్టినట్లు సమాచారం. ‘నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఎక్కువ చెట్లు నరకకుండా తక్కువ అటవీ విధ్వంసం ఉండేలా రోడ్డు విస్తరణ ప్రణాళికలో మార్పులు చేర్పులు సూచించాం. ప్రతిపాదనలు ప్రాథమికస్థాయిలో ఉన్నాయి’ అని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు మధ్య రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల్ని అటవీశాఖ అనుమతించడం లేదు. రాత్రివేళలో తిరిగే పులులు, ఇతర వన్యప్రాణులను దృష్టిలోపెట్టుకుని ఈ నిబంధన అమలుచేస్తున్నారు.

ఎక్కి, దిగేలా ర్యాంపులు వద్దు : రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్‌ కారిడార్‌ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు వివరించగా, ఫ్లైఓవర్‌ మార్గమధ్యంలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని అటవీశాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. లైటింగ్‌ అధికంగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేటెడ్‌ కారిడార్‌పై రాత్రివేళ తక్కువ లైటింగ్‌ పెట్టాలని, నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది.

రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati

భక్తులకు 'దారి' చూపిస్తున్న మల్లన్న - హైదరాబాద్​ - శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్! - Elevated Corridor Srisailam Highway

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.