Road Accident in Anantapur District : మమ్మల్ని బస్సెక్కించి బైకుపై వస్తానంటూ పాడెక్కావా భాస్కరా అంటూ కుటుంబ సభ్యుల రోదన స్థానికులకు సైతం కంటతడి పెట్టించింది. ఈ హృదయవిదారక సంఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. కదిరి మండలం పట్నం వద్ద జాతీయ రహదారి 42పై లారీ - బైక్ ఢీ కొన్న ప్రమాదంలో భాస్కర్ (24) అనే వ్యక్తి మృతి చెందారు.
సీమంతం వేడుకలో ఆనందంగా : కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన భాస్కర్ ఉపాధి కోసం అనంతపురం వెళ్లారు. కొంతకాలం నుంచి అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. పాల వ్యాను డ్రైవర్‌గా పనిచేసే అతను భార్య సీమంతం కోసం స్వగ్రామమైన పట్నానికి శనివారం (అక్టోబర్ 12న) వచ్చారు. ఆదివారం బంధువులు, మిత్రులతో కలిసి సీమంతం వేడుకలో ఆనందంగా గడిపాడు. భార్య, కుటుంబ సభ్యులతో విందులో సంతోషంగా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం తాను బైక్పై వస్తానని తల్లిదండ్రులు, భార్య లక్ష్మిని సోమవారం ఉదయం అనంతపురం బస్సు ఎక్కించారు.
'నీవు లేని లోకంలో ఉండలేను - నీవెంటే నేను'
బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే : భాస్కర్ సొంతూరులో పనులు ముగించుకుని బైక్పై అనంతపురానికి బయలుదేరారు. ఇంతలోనే హంద్రీనీవాకాలువ మోరీ వద్ద లారీ ఢీ కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని కదిరి ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన కదిరి ఆసుపత్రికి చేరుకున్నారు.
ఇంటికెళ్దాం లే కన్నయ్యా - మృతి చెందిన కుమారుడి పక్కన తల్లి రోదన
గుండెలు పగిలేలా రోదన : భార్య సీమంతం కార్యక్రమంలో కుటుంబసభ్యులు, బంధువులతో ఆనందంగా గడిపిన భాస్కర్ చనిపోవడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి వచ్చిన కుమారుడు, తన భర్త ఇకలేడని తెలుసుకున్న భార్య లక్ష్మి గుండెలు పగిలేలా రోదించారు. ఈ సంఘటన సైతం కంటతడి పెట్టింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కదిరి సీఐ మోహన్ తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ- 10మంది కూలీలు స్పాట్ డెడ్! - UP Accident