Retired IPS AB Venkateswara Rao Attended Intimate Gathering: గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు చూపించిన ఆదరాభిమానాలతో అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు. కాని వాటికి ఎదురు నిలబడి ధైర్యంగా పోరాడానని చెప్పారు. అన్యాయం ముందు లొంగిపోవడం చావుతో సమానమని ఏబీ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోగినేని కల్యాణ మండపంలో స్థానికులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఏబీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమకాలీన అంశాలను సభలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. చాలామంది ఉన్న డబ్బును కాపాడుకోవడానికి యజ్ఞాలు, హోమాలు, తీర్థయాత్రలు చేస్తారని ఇలాంటి మూఢనమ్మకాలు వీడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు రప్పించి ఉపాధి కల్పించాలని కోరారు. వాస్తు పేరుతో ఇల్లు పడగొట్టించుకోవడం వంటివి చేయరాదని హితవు పలికారు. పొలాలు కౌలుకు ఇచ్చి ఇంట్లో కూర్చోవడం సరికాదని, ప్రతిఒక్కరూ వ్యవసాయ చేయాలని కోరారు. డిమాండ్‌కు తగినట్లుగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని, నిశితంగా సమాజాన్ని గుర్తించాలని, నిరాడంబరంగా ఉండాలని ఏబీ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
పైసలిస్తేనే రిజిస్ట్రేషన్ - రైతులను పీల్చి పిప్పి చేస్తున్న సీఆర్డీఏ ఉద్యోగులు
ఏపీలో "లక్కీ భాస్కర్లు" - నకిలీ పత్రాలతో మార్టిగేజ్ ఆస్తుల అమ్మకం