Republic Day Children Skating Special Event: వారంతా మూడు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉండే చిన్నారులు. ప్రపంచ రికార్డు సాధనకు నడుం బిగించారు. వారి సంకసల్పానికి తమ గురువు, తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయ్యింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో చిన్నారులు గంటన్నరపాటు ఆగకుండా స్కేటింగ్ చేశారు.
సుమారు 80మంది విద్యార్థులు ఈ క్రీడలో భాగస్వామ్యులయ్యారు. చిన్నారులు చేసిన స్కేటింగ్ పలువురిని ఆకట్టుకుంది. మువ్వెన్నెల జెండా పట్టుకుని చిన్నారులు స్కేటింగ్ చేస్తుంటే తల్లిదండ్రులు వారిని చూసి మురిసిపోయారు. సుమారు గంటన్నరపాటు జాతీయ జెండాను చేత పట్టుకుని ఆగకుండా ఏకధాటిగా చిన్నారులు చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
బైక్‌లపై మహిళ సైనికుల ప్రదర్శన అదుర్స్- నారీమణుల పరేడ్ ఫొటోలు చూశారా?
World Record Skating Event: గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ రికార్డు సాధన కోసం విజయవాడకు చెందిన ఖాదర్ బాషా అనే స్కేటింగ్ కోచ్ ఆరు నెలల పాటు చిన్నారులకు శిక్షణ ఇచ్చి సమాయత్తం చేశారు. ఈ స్కేటింగ్ క్రీడా కార్యక్రమంలో విజయవాడతో పాటు వివిధ జిల్లాల నుంచి 3-14ఏళ్ల చిన్నారులు వచ్చి భాగస్వామ్యం అయ్యారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ స్కేటింగ్ క్రీడ 8.30 గంటల నిమిషాల వరకు ఏకధాటిగా కొనసాగింది. మధ్యలో ఒకరికి ఒకరు తగిలి పడిపోయినా వెంటనే లేచి వారికి వారే తమ తోటి వారితో పోటీ పడుతూ మరింత వేగంతో దూసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. స్కేటింగ్ చేసిన ఈ చిన్నారులకు నిర్వాహకులు మధ్యలో ఎనర్జీ డ్రింక్స్ అదించారు.
ఓ చేతిలో జండా పట్టుకుని మరో చేత్తో ఆ డ్రింక్ పట్టుకుని విద్యార్థులు స్కేటింగ్ క్రీడలో మమేకమయ్యారు. ప్రపంచ రికార్డు సాధనకు ఈ క్రీడలో పాల్గొనటం తమకెంతో ఆనందంగా ఉందని చిన్నారులు తెలిపారు. భవిష్యత్తులో స్కేటింగ్ క్రీడతో పాటు చదువులోనూ రాణించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
"ప్రపంచ రికార్డు సాధనకు చిన్నారులు నడుం బిగించి స్కేటింగ్ చేశారు. ఇందుకోసం ఆరు నెలల పాటు చిన్నారులు శిక్షణ తీసుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ స్కేటింగ్ ఈవెంట్లో మువ్వన్నెల జెండాను పట్టుకుని పాల్గొన్నారు. వారి సంకల్పానికి తమ గురువు, తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయ్యింది. సుమారు 80మంది విద్యార్థులు ఈ క్రీడలో భాగస్వామ్యులయ్యారు. సుమారు గంటన్నరపాటు జాతీయ జెండాను చేతపట్టుకుని ఆగకుండా ఏకధాటిగా చిన్నారులు విన్యాసాలు చేశారు. ఈ స్కేటింగ్ క్రీడా కార్యక్రమంలో విజయవాడతో పాటు వివిధ జిల్లాల నుంచి 3-14ఏళ్ల చిన్నారులు వచ్చి పాల్గొన్నారు" - ఖాదర్ బాషా, స్కేటింగ్ కోచ్
సైనిక సామర్థ్యం చాటిన రిపబ్లిక్ డే పరేడ్- నడిపించిన నారీమణులు- ఆకట్టుకున్న శకటాలు