Republic Day Celebrations in Telangana 2024 : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మంత్రులు, అధికారులు జాతీయ పతకాల్ని ఎగుర వేశారు. మంచిర్యాల జిల్లా పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా అధికారి సంతోష్ జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి.
Telangana Republic Day 2024 : సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ హనుమంతు, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కోదాడలోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
హోవార్డ్ మోడల్ స్కూల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాలో విద్యార్థుల గౌరవ వందనం పలువురిని ఆకట్టుకుంది. మెదక్ జిల్లా పరేడ్ మైదానంలో పాలనాధికారి రాజార్షి షా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Republic Day Celebrations 2024 : గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నారాయణపేటలో జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దామరగిద్దకి చెందిన దాసరి కొండప్ప కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో జిల్లా అధికారుల ఘనంగా సన్మానించారు.
నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం : గవర్నర్
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ సంతోష్ పరేడ్ గ్రౌండ్లో ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రపంచంతో పోటీపడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రజాప్రభుత్వం, పట్టుదల, ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రాధాన్యతలు తెలిపారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్రపతి- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్