ETV Bharat / state

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra - RED ALERT FOR NORTH ANDHRA

Red Alert for North Andhra: ఏపీకి వాన గండం ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కృష్ణా జిల్లా అతలాకుతలం అయ్యింది. తాజాగా వరుణుడు ఉత్తరాంధ్ర వైపు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయో రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ.. వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది. అటు విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలతో స్థానికులు భయం గుప్పిట్లో ఉన్నారు.

Red Alert for North Andhra
Red Alert for North Andhra (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 3:32 PM IST

Updated : Sep 8, 2024, 5:22 PM IST

Red Alert for North Andhra: బంగాళాఖాతంలో ఒడిశా- బంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన వాయుగుండం క్రమంగా వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండురోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు భారీ వర్షం సూచన ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

విరిగిపడుతున్న కొండచరియలు: విజయనగరం, విశాఖ, తూగో, పగో జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా 70 కి.మీ బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కళింగ, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

గోపాలపట్నంలోని రామకృష్ణానగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లకు ప్రమాదం పొంచివుంది. సమాచారం అందుకున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆ ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరారు. ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు. మిగతా ఇళ్లకు కూడా ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert

అప్రమత్తమైన అధికార యంత్రాంగం: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. సొంత వాహనదారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. కొండ చరియలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలు విరమించుకోవాలని కోరుతున్నారు.

విశాఖలో కలెక్టరేట్, పోలీసు కంట్రోల్ రూంలలో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు. కలెక్టరేట్​లోని కంట్రోల్ రూం నెంబర్లు - 0891 2590102, 0891 2590100. అదే విధంగా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ - 08912565454. వీటితో పాటు 100, 112కి కూడా సమాచారం ఇవ్వొచ్చన్నారు.

విశాఖలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికికి జ్ఞానాపురం బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. అల్లూరి జిల్లాలో గూడెం కొత్త వీధి మండలంలో చేమగడ్డ ప్రధాన రహదారి వంతెన కూలిపోయింది. దీంతో సుమారు 30 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు- ఒడిశా నిలిచిన రాకపోకలు - FLOOD IN VIZIANAGARAM DISTRICT

అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు- ప్రమాద స్థాయికి డుడుమ - Rains in Alluri District

Last Updated : Sep 8, 2024, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.