ETV Bharat / state

తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ - విజయంపై నేతల రియాక్షన్​ ఇదే - Telangana Lok Sabha Election Results 2024 - TELANGANA LOK SABHA ELECTION RESULTS 2024

TG BJP Leaders Reacts on Election Victory : తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా 8 లోక్​సభ స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం పట్ల బీజేపీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. తమ తమ స్థానాల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు.

TG BJP Leaders Reacts on Election Victory
TG BJP Leaders Reacts on Election Victory (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 10:45 PM IST

BJP Leaders Reacts on Election Results 2024 : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాలి వీచింది. గత లోక్​సభ ఎన్నికల్లో కంటే, ఈసారి మరిన్ని సీట్లను సాధించి అందరి అంచనాలను తలకిందులు చేసింది. పార్లమెంట్​ ఎన్నికల్లో విజయం పట్ల బీజేపీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజిగిరి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో​ ఘన విజయం సాధించారు. ​తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సీఎం రేవంత్​ అభినందనలు - REVANTH REACTS TO AP ELECTION RESULT

మల్కాజిగిరి ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, పార్లమెంట్ స్థానం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను వమ్ము చేయకుండా అమలు చేస్తానని తెలిపారు. తన విజయంలో అన్నివర్గాల ప్రజలు, కార్యకర్తలు మద్దతిచ్చారని, ఎంపీగా ఎన్నికైన తర్వాత అందరివాడిగా ఉంటానని స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత కూడా మోదీని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించారన్నారు.

ప్రజలు, మోదీ ఆశీర్వాదంతో విజయం సాధించానని బీజేపీ నేత డీకే అరుణ పేర్కొన్నారు. మహబూబ్​నగర్​ స్థానం నుంచి తనను గెలుపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల వంటి వాటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన విజయంలో అన్నివర్గాల ప్రజలు, కార్యకర్తల కృషి మరవలేనిదన్నారు.

సీఎం పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా - YS Jagan Mohan Reddy Resign As CM

తనపై కుయుక్తులు పన్నినా ప్రజలు తిప్పికొట్టారని బండి సంజయ్​ పేర్కొన్నారు. కరీంనగర్‌ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణవ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా కొనసాగిందని, కరీంనగర్‌ ప్రజలు తనకు పెద్దఎత్తున మెజార్టీ అందించారన్నారు. ఇతర పార్టీలు తప్పుడు ప్రచారాలు చేసి ప్రలోభాలకు గురి చేశారని, కరీంనగర్‌ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

ఈ విజయం మోదీ, ప్రజలకు అంకితమని, కార్యకర్తలు మూడు నెలలుగా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజలపక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా పోరాడుతానని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఇబ్బంది పెట్టిందని, ఆరు గ్యారంటీల అమలు కోసం పోరాడుతానని ప్రజలు నమ్మారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్‌కు కేంద్ర నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని, కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.

ఆర్కే రోజా ఘోర పరాజయం - జబర్దస్త్‌ ఓటమిని రుచిచూపించిన నగరి ప్రజలు - Roja lost in Nagari constituency

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.