ETV Bharat / state

తిరుమలలో 'కన్నులపండువగా' రథసప్తమి వేడుకలు - పోటెత్తిన భక్తులు

Ratha Saptami Celebrations: సూర్యభగవానుని రథసప్తమి వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్తగిరీశుడు సప్తవాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు 4 సంవత్సరాల తరువాత తిరుమల మాడవీధుల్లో నిర్వహించిన వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి పులకించిపోయారు.

Ratha_Saptami_Celebrations
Ratha_Saptami_Celebrations
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 8:31 AM IST

తిరుమలలో 'కన్నులపండువగా' రథసప్తమి వేడుకలు - పోటెత్తిన భక్తులు

Ratha Saptami Celebrations : తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్తగిరీశుడు సప్తవాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలను తిలఖించేందుకు పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి పునీతులయ్యారు. దాదాపు రెండు లక్షల మంది పైగా వాహన సేవలను తిలకించారని అంచనా వేశారు. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది. నాలుగు సంవత్సరాల తర్వాత మాడ వీధుల్లో షెడ్లును ఏర్పాటు చేసి వేసవి తాపం భక్తులపై పడకుండా చర్యలు తీసుకుంది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిన సౌకర్యాలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

సూర్యప్రభవాహన సేవ : మాఘశుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభోవపేతంగా ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన వాహనసేవలు రాత్రి తొమ్మిది గంటల వరకూ కన్నులపండువగా సాగాయి. మొదటగా స్వామివారు సూర్యప్రభవాహనంపై సూర్యనారాయణమూర్తిగా ఊరేగుతూ వాయువ్య దిశకు చేరుకున్నారు. అక్కడ స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన అనంతరం అర్చకులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించడంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా రథసప్తమి వేడుకలు - భక్తుల దైవ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

చక్రస్నానం : సూర్యప్రభవాహన సేవ అనంతరం చిన్నశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో స్వామివారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మద్య చక్రతాళ్వార్లకు అభిషేకాదులు, దూప దీప నైవేధ్యాలను సమర్పించి పుష్కరస్నానం చేయించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

వాహనసేవలు - కళాబృందాలు : ఉదయం పూట జరిగిన వాహన సేవల్లో మలయప్పస్వామివారు మాత్రమే దర్శనమివ్వగా మధ్యాహ్నం తరువాత కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో విశేషతిరువాభరణాలు, పరిమలభరిత పూల మాలలతో అలంకృతులైన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్రం సంద్యవేళలో చల్లని వెన్నెల సమయంలో చంద్రప్రభను అధిరోహించిన తిరుమలేశుడు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను ఆనంద పరవశిపజేశారు. వాహనసేవల్లో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళల కోలాటాలు, చక్కబజనలు, వివిధ దేవతామూర్తుల వేషదారణలతో తిరుమాడవీధుల్లో ఆడిపాడారు.

రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యభగవానుడికి విశేష పూజలు

ప్రశాంత వాతావరణంలో ఉత్సవమూర్తులు : రథసప్తమి వేడుకలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు పూర్తిగా నిండిపోయాయి. ఉదయం ఐదు గంటలకు మాడవీధుల్లోకి చేరుకున్న భక్తులు రాత్రి చంద్రప్రభవాహనసేవ ముగిసేవరకు సప్త వాహనసేవల్లోనూ పాల్గొన్నారు. ఈ ఏడాది తిరువీధుల్లో షెడ్ల ఏర్పాటు చేయడంతో యాత్రికులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. రెండు వేల మంది శ్రీవారి సేవకులతో నిరంతరాయంగా వివిధ రకాల అన్నప్రసాదాలను, మంచినీరు, మజ్జిగను అందిచారు. గ్యాలరీల వద్ద సీనియర్‌ అధికారులతో నిరంతరం పర్యవేక్షించారు.

ప్రత్యేక దర్శనాలు : రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం రద్దు చేసిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను తిరిగి పునరుద్దరించారు.

అరసవల్లి రథసప్తమి వేడుకలు ప్రారంభం - స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.