ETV Bharat / state

అరసవల్లి రథసప్తమి వేడుకలు ప్రారంభం - స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Arasavalli Ratha Saptami Celebrations: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. వెలుగుల రేడు జయంత్యుత్సవం కావడంతో అర్ధరాత్రి పన్నెండున్నరకు ఉత్సవానికి అంకురార్పణం జరిగింది.

Arasavalli_Ratha_Saptami_Celebrations_Start

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 9:26 AM IST

అరసవల్లి రథసప్తమి వేడుకలు ప్రారంభం - స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Arasavalli Ratha Saptami Celebrations : శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. గురువారం సాయంత్రం నుంచే ఊరంతా సందడి వాతావరణం నెలకొంది. రాత్రి 9 గంటల నుంచి ఆదిత్యుడి నిజరూపాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు దీరారు. వెలుగుల రేడు జయంత్యుత్సవం కావడంతో అర్ధరాత్రి పన్నెండున్నరకు ఉత్సవంకు అంకురార్పణం జరిగింది.

Ratha Saptami in Arasavalli : ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఇప్పిలి నగేష్‌ శర్మ నిర్వహణలో అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ క్షీరాభిషేకాన్ని కన్నుల పండువగా జరిపించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంధ్ర సరస్వతి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు ఉదయం 7 గంటల వరకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు. అక్కడ నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సూర్యనారాయణ స్వామివారు నిజ రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అలంకరణలో ఉన్న సూర్యనారాయణ స్వామి వారిని భక్తులు దర్శించుకోనున్నారు.

మల్లన్న మహాకుంభాభిషేకానికి ముహూర్తం ఖరారు- ఈ నెల 21న నిర్వహణకు దేవస్థానం సంసిద్ధం

SuryaNarayana Swamy Temple in Arasavalli : శ్రీకాకుళం నగర వీధులన్నీ జనసంచారంతో కనిపించాయి. కోవెలను పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రథమార్చన పూజ చేశారు. దేవాదాయశాఖ ప్రాంతీయ సంచాలకులు ఎం.విజయరాజు, దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌, ఆలయ ఈవో డీఎల్‌వీ రమేశ్‌ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈవో సూర్యప్రకాశ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వెలుగులరేడు క్షేత్రంలో చిమ్మ చీకట్లు : అరసవల్లిలోని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. సూర్యభగవానుడి జయంతి రోజున గురువారం ఆలయ గోపురం, ఇంద్రపుష్కరిణి పరిసరాలు ఎలాంటి విద్యుత్తు కాంతులు లేకుండాపోవడంతో వెలవెలబోయి కనిపించాయి. రథసప్తమి పర్వదినాన ఇలా వెలుగులు లేకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింహాద్రి అప్పన సన్నిధిలో మకర వేట ఉత్సవాలు

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. మేళ తాళాలు, పుష్పలకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.

మకర జ్యోతి దర్శనం- అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.