Government School Problem in Srikakulam District : నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలన్నీ మార్చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఊదరగొడుతూ ఉంటారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కనీస మౌలిక వసతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల పై పెచ్చులు ఊడిపోతూ, తాగడానికి నీరు లేక, సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి దుస్థితిలోనే శ్రీకాకుళం జిల్లాలోని ప్రాథమిక పాఠశాల్లో నెలకొంది. రాళ్లపేట ప్రాథమిక పాఠశాలకు కేటాయించిన నాడు-నేడు నిధులు నిలిచిపోవడంతో పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. కూలడానికి సిద్ధంగా ఉన్న భవనంలోనే ఉపాధ్యాయులు తరగతి గదులను నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Rallapeta Govt School : శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం పంచాయతీ పరిధిలో ఉన్న రాళ్లపేటలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ ఒకటి నుంచి 5వ తరగతి వరకు 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది దశాబ్దాల కాలం నాటి పాఠశాల కావడంతో భవనం మరమ్మతులు, వంటగది కోసం మూడు ఏళ్ల క్రితం నాడు నేడు పనులు కింద 12 లక్షల రూపాయలు కేటాయించారు. అందులో 2,25,000 మాత్రమే నిధులు విడుదలయ్యాయి. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి.
ఐదు తరగతులు - ఒకే గది - ఇవేమీ చదువులు - Government School Problems
Govt School Student Problem : నాడు నేడు నిధులు నిలిచిపోవడంతో శిధిలావస్థలో ఉన్న భవనంలోని చిన్న వెలుతురు లేని గదిలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తున్నారు. తాగునీటి కొరత, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదిలో బ్లాక్ బోర్డ్, లైట్, ఫ్యాన్, లాంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు వర్ణతీతం. తమ పరిస్థితిని చూసి ప్రైవేటు పాఠశాల విద్యార్థులు హేళన చేస్తున్నారని వాపోతున్నారు.
"పాఠశాల పెచ్చులు ఊడిపోతున్నాయి. బోర్డు, లైట్లు, ఫ్యాన్ లేదు. తాగడానికి నీరు కూడా లేదు. మరుగుదొడ్లు సౌకర్యం లేదు. మా అమ్మనాన్న పాఠశాలకు వెళ్లవద్దని అంటున్నారు. ప్రైవేటు స్కూల్కు వెళ్లేలేని పరిస్థితి. మాకు కొత్త పాఠశాలను కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము" -రాళ్లపేట విద్యార్థులు
Primary Education ప్రాథమిక విద్య ఛిన్నాభిన్నం
No Nadu Nedu in Govt School : పాఠశాల తరగతి గదికి కిటికీలు కూడా లేకపోవడంతో పాటు ఒకే గదిలో తరగతులు నిర్వహణ, మధ్యాహ్నం భోజనం అన్నీ ఒకే చోట ఉండడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉన్నా ఇక్కడే చదువుతున్నామని తెలిపారు. తమ ఇబ్బందులను అధికారులు గుర్తించి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.